తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం! | Heavy Rain in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం!

Published Mon, Oct 21 2013 10:29 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

Heavy Rain in Tirumala

తిరుమలలో సోమవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఆదివారం ఉదయం మొదలైన వాన సోమవారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. శ్రీవారి ఆలయం, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. శ్రీవారి ఆలయంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూనే వెళ్లారు. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. ఘాట్‌రోడ్లలో పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కాగా తిరుమలలో సోమవారం రద్దీ సాధారణంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement