sun hot
-
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
సాక్షి, తిరుపతి: తిరుమలలో వర్షం కురిసి చల్లబడింది. సూర్యుడు ప్రతాపం చూపుతుంటే వరుణ దేవుడు వర్షంతో భక్తులను చల్లర్చారు. తిరుమలలో మధ్యాహ్నం దాదాపు గంటలపాటు వర్షం కురిసింది. వేసవిలో ఎండలు మండిపోతుంటే నేడు కురిసిన వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.గంటపాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు కూల్ అయ్యారు. తిరుమల కొండపైనే కాకుండా ఘాట్ రోడ్డు మొత్తం వర్షం పడటం విశేషం. దీంతో కొండ ఎక్కే వారు.. కొండ దిగేవారు వర్షంతో.. చల్లటి వాతావరణంతో సేదతీరారు. చాలా మంది భక్తులు వర్షంతో తడుస్తూ గంతులు వేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కొండ కింద తిరుపతిలో మాత్రం వర్షం లేదు.. కేవలం తిరుమల కొండల్లోనే వర్షం పడింది.కాగా, ఏపీలో ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు తీవ్రతరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. -
కూతురు హోం వర్క్ చేయలేదని కాళ్లుచేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో విలవిలలాడిన బిడ్డ
-
ఎండలో విలవిలలాడిన బిడ్డ.. తల్లి పనే!!
కాళ్లు చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో చిన్నారిని పడుకోబెట్టారు. భరించలేక ఆ బిడ్డ విలవిలలాడిపోయింది. చివరికి బాధతో రోదించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఈమధ్య ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ఎక్కడ? ఎందుకు? జరిగిందనే విషయాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఢిల్లీ ఖాజూరీ ఖాస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు హోం వర్క్ చేయకపోవడంతోనే అలాంటి శిక్ష విధించానని ఆ చిన్నారి కన్నతల్లి చెబుతోంది. అయితే ఐదు పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కరావాల్ నగర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ఆపై స్థానికంగా ఆ ఘటన ఎక్కడా జరగలేదని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. ఘటన సమయంలో పక్కనే ఉన్న బిల్డింగ్లో నుంచి వీడియో తీసినట్లు తేలింది. అతని ద్వారా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోను చేధించారు. After a video of a girl child tied up on the roof of a house surfaced on social media, all possible efforts were made by Delhi Police to ascertain her identity and circumstances. The family of the child has been identified and appropriate action initiated.#DelhiPoliceCares — Delhi Police (@DelhiPolice) June 8, 2022 ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. ఆ తల్లికి కూడా అలాంటి శిక్షే విధించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. -
అలసి ఆగిన గుండె
మండలంలోని రాపాక కూడలి సమీపంలో సైకిలు తొక్కుతూ గురువారం వ్యక్తి మృతిచెందాడు. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామానికి చెందిన సీర రాము ఐస్ వ్యాపారం చేసేందుకు సైకిలు తొక్కుతూ వస్తున్నారు. అలసటగా అనిపించటంతో రాపాక కూడలి వద్ద నీడలో సైకిలు ఆపి చేరబడ్డారు. చాలా సమయం గడిచినా కూర్చున్న వ్యక్తి కదలకపోవడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వీరు వచ్చి వ్యక్తిని పరిశీలించగా మృతిచెందినట్లు గుర్తించారు. ఎండలో సైకిలు తొక్కడం వల్ల వడదెబ్బకు గురై ఉండవచ్చేమోనని, లేదా గుండెపోటుతోనైనా మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు. -
సూర్యః 43.7 డిగ్రీలు
- నగరంలో మండుతున్న ఎండలు - రోడ్లెక్కేందుకు జంకుతున్న జనం సాక్షి, న్యూఢిల్లీ: నగరం ఎండ తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిపోయింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. గురువారం పగటి ఉష్ణొగ్రత 43.7 డిగ్రీలు ఉండటంతో అన్ని వయసుల వారు వేడిని తట్టుకోలేక అవస్థ పడాల్సి వచ్చింది. భానుడు భగ్గుమంటుండటంతో నగరం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో రెండు మూడు రోజులు చిరుజల్లులు కురిసినా ఎండలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇక నగరంలో గురువారం 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఉదయం పది గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మళ్లీ సాయంత్రం తర్వాత రహదారులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. నగరంలో ఎండవేడి మరి కొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ విభాగం అంటోంది. శుక్ర, శని, ఆదివారాలలో ఆకాశం స్వల్పంగా మేఘావృతమెనప్పటికీ ఇప్పట్లో వర్షం పడే సూచనలు లేవని వాతావరణ విభాగం తెలిపింది.