మృతి చెందిన సీర రాము
మండలంలోని రాపాక కూడలి సమీపంలో సైకిలు తొక్కుతూ గురువారం వ్యక్తి మృతిచెందాడు. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామానికి చెందిన సీర రాము ఐస్ వ్యాపారం చేసేందుకు సైకిలు తొక్కుతూ వస్తున్నారు. అలసటగా అనిపించటంతో రాపాక కూడలి వద్ద నీడలో సైకిలు ఆపి చేరబడ్డారు.
చాలా సమయం గడిచినా కూర్చున్న వ్యక్తి కదలకపోవడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వీరు వచ్చి వ్యక్తిని పరిశీలించగా మృతిచెందినట్లు గుర్తించారు. ఎండలో సైకిలు తొక్కడం వల్ల వడదెబ్బకు గురై ఉండవచ్చేమోనని, లేదా గుండెపోటుతోనైనా మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment