తిరుమలలో వర్షం
తిరుమల: తిరుమలలో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షం పడింది. తిరుమలలో సాయంత్రం 5 గంటల సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది.ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తం అయింది.