ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, ఆకస్మిక ధనలాభం | Today Telugu Horoscope On April 12th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, ఆకస్మిక ధనలాభం

Published Fri, Apr 12 2024 6:53 AM

Daily Horoscope: Rasi Phalalu On April 12 2024 In Telugu - Sakshi

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి సా.5.09 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి తె.4.48 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి మృగశిర, వర్జ్యం: రా.8.56 నుండి 9.32 వరకు,

దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.12 వరకు,
అమృతఘడియలు: రా.1.40 నుండి 3.14 వరకు;
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,
సూర్యోదయం: 5.49,
సూర్యాస్తమయం: 6.10. 

మేషం: రుణఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగమార్పులు. 

వృషభం: నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మిథునం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. 

కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం.

సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహన,గృహయోగాలు. వృత్తి,వ్యాపారాలలో అనుకూలత. దైవదర్శనాలు. 

కన్య: ఆప్తులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆప్తులతో వివాదాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. 

వృశ్చికం: సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. దైవదర్శనాలు. 

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభం. 

మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 

కుంభం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాల పరిష్కారం. 

మీనం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. 

Advertisement
Advertisement