Best BSNL Recharge Plan Under Rs 190: Details Inside - Sakshi
Sakshi News home page

Best Recharge Plans: అతి తక్కువ ధరలో రీచార్జ్‌ ప్లాన్స్‌.. నెలంతా అన్‌లిమిటెడ్‌!

Published Mon, Aug 14 2023 1:19 PM

Best BSNL recharge plan under Rs 190 - Sakshi

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్ టెల్ వంటి బడా కంపెనీలకు పోటీగా తమ వినియోగదారులకు తక్కువ ధరలోనే డేటా, కాల్స్, ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది. నెలంతా కేవలం రూ. 200 కంటే తక్కువ ధరలతో రీఛార్జ్ ప్లాన్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ ప్లాన్స్ వివరాలేంటో తెలుసుకుందాం..

రూ. 184 ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ . 184 ప్లాన్ కింద కస్టమర్లకు నెలంతా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 1జీబీ రోజువారీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. తక్కువ సంఖ్యలో నెట్ వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.

రూ. 185 ప్లాన్
రూ.184 ప్లాన్ ప్రయోజనాలనే రూ. 185 ప్లాన్ కూడా అందిస్తోంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాలు ఉంటాయి. అయితే రోజువారీ డేటా ఉపయోగించిన తర్వాత ఈ ప్లాన్‌ కింద కస్టమర్లకు 40Kbps వేగంతో ఇంటర్నెట్‌ లభిస్తుంది. 

రూ. 186 ప్లాన్
రోజూ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఈ రూ. 186 ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 1జీబీ రోజువారీ డేటా, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది.

ఇదీ చదవండి: GST On X: ట్విటర్‌ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు!

Advertisement

తప్పక చదవండి

Advertisement