Director Rajamouli Enters Into Adds Business, His Latest Oppo Add Clip Goes Viral - Sakshi
Sakshi News home page

టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి కొత్త అవతార్‌: హీరోలకు షాకే!?

Published Thu, Jun 29 2023 10:11 AM

Director Rajamouli into adds business oppo add clip goes viral - Sakshi

టాలీవుడ్‌ జక్కన ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొత్త అవతార్‌ మెత్తాడు. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో యాడ్‌ మేకింగ్‌లో  అగ్ర దర్శకుడు రాజమౌళి  తళుక్కుమన్నాడు. ఈ యాడ్‍కు సంబంధించిన టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటివరకు సెలబ్రిటీలు, స్టార్‌ ఆటగాళ్లు,  సినిమా  సూపర్‌ స్టార్లు మాత్రమే పలు బ్రాండ్లకు నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్‍లకు ప్రచారకర్తలుగా కనిపించారు. కేవలం తమ వృత్తి ద్వారా మాత్రమే కాకుండా, బ్రాండ్‍ అంబాసిడర్లుగా భారీగానే ఆర్జించారు. కానీ అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లుగా కనిపించి అరుదు. ఈ లోటును పూడ్చేందుకు మన  దర్శకధీరుడు  రడీ అయిపోయాడు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్‌ యూట్యూబర్‌గా  కోట్లు, ఎలా?)

ఒప్పో బ్రాండ్‌ రాజమౌళిని తమ ప్రచారకర్తగా ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు  ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన  రాజమౌళికి టాలీవుడ్‌ మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో తనకున్న పాపులారిటీ, క్రేజ్ అలాంటిది మరి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలతో ప్యాన్‌ ఇండియా ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళితో ఒప్పో తన అప్‌కమింగ్‌  ఫోన్ రెనో 10 సిరీస్ వస్తున్న ఫోన్ ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. జూలై  10న ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. రాజమౌళి డ్యుయల్ రోల్‍లో సూపర్బ్‌గా ఉన్న ఈ క్లిప్ వైరల్‍గా మారింది.  హీరోలను మించి  స్టైలిష్‍గా, హ్యాండ్‍సమ్‍గా  డ్యుయల్ రోల్‍లో కనిపించిన తమ అభిమాన దర్శకుడిని చూసి ఫ్యాన్స్‌ ఖుషీ అయిపోతున్నారు.  (థ్యాంక్స్‌ టూ యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌, లేదంటే నా ప్రాణాలు: వైరల్‌ స్టోరీ)

కాగా కరియర్‌ పరంగా గురించి ఆలోచిస్తే..రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్‍లో మరో మూవీ తీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ రేంజ్‍లో ఉండబోతోందని  హింట్‌ కూడా ఇచ్చేసి ఈ మూవీపై ముందునుంచే భారీ హైప్‌  క్రియేట్‌ చేశాడు.  ఈ సూపర్‌  కాంబో మూవీ 2025లో రిలీజ్‌కానుందని అంచనా. (వాట్సాప్‌ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్‌: ఒకేసారి 32 మందితో)

Advertisement
Advertisement