జియో ఫైనాన్షియల్ సరికొత్త రికార్డులు! | Sakshi
Sakshi News home page

జియో ఫైనాన్షియల్ సరికొత్త రికార్డులు!

Published Fri, Feb 23 2024 11:29 AM

Jio Financial Services Hits Rs 2 Lakh Crore Market Cap - Sakshi

దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో సరికొత్త రికార్డ్ లను నమోదు చేశాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ధర 35 శాతం పెరిగింది. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ. 2 లక్షల కోట్లను అధిగమించింది. ఫిబ్రవరి 23న పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం రికార్డు స్థాయిని తాకింది.

ఉదయం 10.30 గంటల సమయానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 8 శాతం పెరిగి.. ఒక్కోషేర్ ధర రికార్డు స్థాయిలో రూ. 326కి చేరుకుంది. ఈ స్టాక్ వరుసగా ఐదవ సెషన్‌లో 17 శాతం వృద్ధిని నమోదు చేయడంతో సంస్థ విలువ పరంగా రూ. 2.08 లక్షల కోట్లు దాటేందుకు దోహదపడింది. ఆర్‌ఐఎల్ ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో రూ.2,989ను తాకింది. బీఎస్ఈలో ఈ షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే 0.5 శాతం పెరిగి రూ.2,978 వద్ద ట్రేడవుతోంది.

వ్యూహాత్మక అడుగులు
జియో ఫైనాన్షియల్ సెక్యూర్డ్ లోన్లు అందించేందుకు దృష్టి సారిస్తోంది. ఆర్ధిక విభాగంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా దాని సురక్షిత రుణ వ్యాపారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని అనుబంధ సంస్థ జియో ఇన్ఫర్మేషన్ అగ్రిగేటర్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఫైబర్, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాల కోసం ఆపరేటింగ్, ఫైనాన్సింగ్ లీజులను అందించడం, చైన్ ఫైనాన్సింగ్, సరఫరాదారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేలా వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తోంది.  

కాగా, జనవరిలో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా భారత్ లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు పత్రాలను దాఖలు చేశాయి.

 39 కంపెనీలు@ రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్
ప్రస్తుతం, 39 కంపెనీలు స్టాక్ మార్కెట్ లో రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.20.05 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.14.78 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.10.78 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్‌ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అంటారు.

Advertisement
Advertisement