అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్‌? నిజమెంత.. | Sakshi
Sakshi News home page

అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్‌? నిజమెంత..

Published Mon, Feb 5 2024 6:24 PM

Jio Financial shares soar as reports suggest Mukesh Ambani to acquire Paytm wallet - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి.

పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్‌లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆర్‌బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా..
పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది.

పేటీఎం సీఈఓ ఏమన్నారంటే..
ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజ‌య్ శేఖ‌ర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్క‌ర‌ణ‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంద‌ని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం క‌రో ఓ ఛాంపియన్‌గా నిలుస్తుంద‌ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు.

ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..

Advertisement

తప్పక చదవండి

Advertisement