ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్‌'! | Sakshi
Sakshi News home page

ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్‌'

Published Wed, Feb 7 2024 12:37 PM

Bangkoks Chef Pichaya Pam Wins Asias Best Female Chef 2024 - Sakshi

బ్యాంకాక్‌లోని పోటాంగ్‌లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెఫ్‌ పిచాయా పామ్‌ సూన్‌టోర్నియానాకిజ్‌ 2024 సంవత్సరానికి ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా టైటిల్‌ని గెలుచుకుంది. బ్యాంకాక్‌లో పెరిగిన థాయ్‌, చైనీస్‌ ,ఆస్ట్రేలియన్‌ చెఫ్‌ పిచాయా పొటాంగ్‌లో మంచి పేరుగాంచిన చెఫ్‌గా ప్రసిద్ధి చెందింది. తన పామ్‌ జాతి వారసత్వానికి గుర్తుగా థాయ్‌ చైనీస్‌ వంటకాలను హైలెట్‌ చేస్తోంది. ఆమె ఈ అవార్డుని మార్చి 26, 2024న కొరియాలోని సియోల్‌లో వేడుకగా జరగనున్న అవార్డుల ఫంక్షన్‌లో ఆ అవార్డుని  తీసుకుంటారు.  ఈ ఏడాదిలో ఓపెనింగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలైన తొలి మహిళా చెప్‌గా​ పిచాయా పామ్‌ నిలిచింది.

ఈ ఏడాది అవార్డులను ఉత్తమ రెస్టారెంట్‌లు, బెస్ట్‌ చెఫ్‌ల వారిగా విస్తృత జాబితాను చేసింది. గతేడాది ఆసియాలో 50 ఉత్తమ రెస్టారెంట్‌లలో ఆమె రెస్టారెంట్‌ ​ 35వ స్థానంలో ఉండగా, ప్రపంచంలోనే 50 ఉత్తమ రెస్టారెంట్‌ జాబితాలో పిచాయ్‌ రెస్టారెంట్‌ 88వ స్థానానికి పరిమితమయ్యింది. 'పోటాంగ్‌ ' అంటే సింపుల్‌ అని అర్థం. ఆమె తన పామ్‌ జాతి వారసత్వాన్ని, కుటుంబ వృత్తి అయినా ఆయర్వేద వైద్యాన్ని ప్రతిబింబించేలా వంటలు చేస్తుంది. అంతేగాదు చైనాటౌన్‌ ఆధారిత రెస్టారెంట్‌ ఆమె కుటుంబానికి చెందిన హెర్బల్‌ ఫార్మసీని కూడా పునర్నిర్మించే పనిలో ఉంది.

ఆమె ప్రధానంగా 'సాల్ట్, యాసిడ్, స్పైస్, టెక్స్‌చర్, మైలార్డ్ రియాక్షన్ వంటి ఐదు ఇన్‌గ్రేడియంట్స్‌ ఫిలాసఫి కచ్చితంగా ఉండేలా తన వంటల మెనూని రూపొందించింది. ఆమె వంటల మెనూ పురాతన సంప్రదాయల్ని మిళితం చేసేలా ఉంటుంది. అంతేగాదు పిచాయా అమెరికన్‌ ఉమెన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ థాయిలాండ్‌ సహకారంతో సొంతంగా స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఉమెన్‌ ఫర్‌ ఉమెన్‌(డబ్ల్యూఎఫ్‌డబ్ల్యూ)ని కూడా ప్రారంభించింది. ఇది ఒక లాభప్రేక్ష లేని సంస్థ. దీని సాయంతో గ్రామీణ మహిళకు పాకశాస్త్రంలో నైపుణ్యాలను, మెళుకువలను నేర్పిస్తుంది. పిచాయా ఏళ్లుగా పాకశాస్త్రంలో తీసుకున్న శిక్షణ, తన కుటుంబ ప్రోత్సహాం, చిన్ననాటి నుంచి రుచుల సమ్మేళనాల గూర్చి విన్న కథలు, తదితరాలు తనను  ప్రపంచ స్థాయిలో అందరూ మెచ్చుకునేలా వండే స్థాయికి తీసుకొచ్చాయని చెప్పుకొచ్చింది. అదే తనకు ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా స్థానం దక్కించుకునేలా చేసిందని చెప్పింది చెఫ్‌ పిచాయా. 

(చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..)

Advertisement
 
Advertisement
 
Advertisement