Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి! | Sakshi
Sakshi News home page

Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి!

Published Fri, Apr 26 2024 6:11 PM

Beauty Tips Pedicure At Home In Easy Ways And Smooth Skin - Sakshi

మారుతున్న వేడి వాతావరణం కారణంగా చర్మ సమస్యలు రావచ్చు. పాదాల విషయానికొస్తే.. దుమ్ము, దూళితో పాదాలు నలుపెక్కే అవకాశం ఉంది. చెమటతో మరింత మందంగా చీలికలేర్పడవచ్చు. కనుక మృదువైన పాదాల సంరక్షణకై ఈ చిన్న చిట్కాలు ఏంటో చూద్దాం.

ఇలా చేయండి..

  • చేతులు, పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మతొక్కతో రుద్దితే పోతాయి.
  • సమ్మర్‌లో బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్‌ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి.
  • రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మసాజ్‌ క్రీమ్‌ లేదా ఆయిల్‌తో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.
  • పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్‌ చేసుకోవాలి.
  • స్నానం పూర్తయిన తర్వాత పమిస్‌ స్టోన్‌తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుగా ఉంటాయి.

ఇవి చదవండి: ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement