వ్యక్తిగత డేటా సేఫ్‌గానే ఉందా?.. తెలియాలంటే.. | Sakshi
Sakshi News home page

డేటా సేఫ్‌గా ఉందో లేదో తెలియాలంటే..తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు!

Published Thu, Sep 7 2023 10:20 AM

How To Find Out If Your Data Was Exposed In A Breach - Sakshi

వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్‌మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. 

వ్యక్తిగత డిజటల్‌ హక్కులలో... 
యాక్సెస్‌ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్‌ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్‌డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (జీడీపీఆర్‌) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్‌ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 

మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే...
ఆన్‌లైన్‌ షాపింగ్‌: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్‌ నెంబర్, క్రెడిట్‌కార్డ్‌ వివరాలు, ప్రొడక్ట్‌ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్‌ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్‌ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్‌... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. 

డేటింగ్‌ యాప్‌లు... 
పేరు, జెండర్, వయసు, సెక్కువల్‌ ఓరియెంటేషన్, ఫోన్‌ నెంబర్, ప్రైవేట్‌ చాట్, పొలిటికల్‌ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్‌ డివైజ్‌ సమాచారం, ఐపీ అడ్రస్‌.. ఈ యాప్‌ ద్వారా బహిర్గతం అవుతాయి.

సెర్చ్‌ ఇంజిన్లు.. 
ఆన్‌లైన్‌ సెర్చింగ్, బ్రౌజింగ్‌ హిస్టరీ, ఆన్‌లైన్‌ ఆసక్తులు, షాపింగ్‌ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డులు, పరికర సమాచారం, డౌన్‌లోడ్‌ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్‌ యాడ్‌–ఆన్‌లు.. ద్వారా జరుగుతుంటుంది.

సోషల్‌ మీడియా.. 
పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, ఫైల్స్, ఫోన్‌ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్‌ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్‌ గ్రూప్, గ్రూప్‌ చాట్స్, పోస్టులు, ట్యాగ్‌ చేసిన ఫొటోలు అండ్‌ వీడియోలు.. సోషల్‌ మీడియా ద్వారా జరుగుతుంటాయి.

గుర్తించదగిన సమాచారం.. 
మీ పుట్టిన రోజు లేదా ఫోన్‌ నెంబర్‌ వంటివి పబ్లిక్‌  రికార్డ్‌లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్‌ ఇంజనీరింగ్‌ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. 

సురక్షిత చర్యలు.. 
చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్‌ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్‌ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి.

భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. 
మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్‌ 69 బి) సెక్షన్‌ 69ఎ సి) సెక్షన్‌ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. 

తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్‌ వర్డ్స్‌ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్‌ యాప్‌ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి
పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్‌ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఫిషింగ్‌ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్‌ చేయరాదు. డేటా కేర్‌ సాఫ్ట్‌వేర్‌/యాప్స్‌ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి ∙
మీ బ్రౌజర్‌ని అప్‌డేట్‌ మోడ్‌లో ఉంచాలి.
​https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్‌సైట్‌లను మాత్రమే యాక్సెస్‌ చేయాలి
https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్‌ పూర్తి హెడర్‌ను చెక్‌ చేయాలి
మీ యాప్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్‌ చేస్తున్నాయో చెక్‌ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్‌ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. 

మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్‌ చేయాలంటే.. 
మీ ఇమెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ల్‌లో సెర్చ్‌ చేయచ్చు.

(a) https://amibeingpwned.com 
(b) https://snusbase.com 
(c) https://leakcheck.net 
(d) https://leaked.site 
(e) https://leakcorp.com/login 
(f) https://haveibeensold.app. 

 



 


 


అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 


(చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్‌" అనే పేరు ఎలా వచ్చిందంటే..)

Advertisement
 
Advertisement
 
Advertisement