ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌

Published Wed, May 8 2024 8:35 AM

ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌

జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.రఘు

గుంటూరు ఎడ్యుకేషన్‌: పట్టభద్రులైన విద్యావంతులు ఉపాధి కల్పన కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌ విధానంలో ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చునని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.రఘు తెలిపారు. మంగళవారం గుజ్జనగుండ్ల సర్కిల్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో మాట్లాడారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు www.empoyment.ap.gov.in సైట్‌కు మొబైల్‌, ఆధార్‌ నంబరు, ఈ–మెయిల్‌ ద్వారా లాగిన్‌ అయ్యి సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని చెప్పారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకు జాబ్‌మేళాలను నిర్వహించే సమయంలో వాటి సమాచారం నేరుగా చేరుతుందని చెప్పారు. రెన్యువల్‌ను ఆన్‌లైన్‌ పోర్టల్‌లోనే చేసుకోవచ్చునని సూచించారు. ఎంప్లాయిమెంట్‌, రెన్యూవల్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 48 గంటల లోగా ఎంప్లాయిమెంట్‌ కార్డు జనరేట్‌ అవుతుందని తెలిపారు. జిల్లాలో విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఎంప్లాయింట్‌ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కఠెవరం పొలాల్లో జార్ఖండ్‌ వాసి మృతదేహం

తెనాలి రూరల్‌: తెనాలి మండలం కఠెవరం పొలాల్లో జార్ఖండ్‌ వాసి మృతి చెంది ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో రూరల్‌ ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, సిబ్బంది ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్‌ ఉండడంతో దాని ద్వారా అతను జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సోరెన్‌ విజయ్‌(39)గా గుర్తించారు. తన తోటి కూలీలతో కలసి చైన్నెలో పనులకు వెళ్తూ ఆదివారం తెనాలిలో రైలు దిగి అది కదిలే లోపు ఎక్కలేకపోయాడు. సోమవారం ఉదయం పట్టాల వెంబడి నడుచుకుంటూ కఠెవరం పొలాల వైపు వచ్చి బహిర్భూమికి వెళ్లి రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement