ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు నిజమే: ఇటలీ | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు నిజమే: ఇటలీ

Published Fri, Apr 19 2024 9:15 PM

Italy Confirms Israel Drone Strikes On Iran - Sakshi

క్యాప్రి ఐలాండ్‌: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.  ఇరాన్‌లో శుక్రవారం(ఏప్రిల్‌ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్‌ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్‌  నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది.

ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్‌లో జరుగుతున్న జీ7 మీటింగ్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ నగరంలోని న్యూక్లియర్‌ స్థావరాల సమీపంలో పలు డ్రోన్‌లను కూల్చివేసినట్లు ఇరాన్‌ తెలిపింది. డ్రోన్‌ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది.

ఇటు ఇరాన్‌పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్‌లు, మిసైళ్లను ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. ఇరాన్‌ దాడుల వల్లే ఇజ్రాయెల్‌ ప్రతిదాడులకు దిగింది.

ఇదీ చదవండి.. ఫ్రాన్స్‌: ఇరాన్‌ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం

Advertisement
Advertisement