US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి | Sakshi
Sakshi News home page

US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి

Published Mon, Feb 26 2024 5:54 AM

USA presidential election 2024: Nikki Haley risks home state humiliation against Trump in South Carolina - Sakshi

చార్లెస్టన్‌: సొంత రాష్ట్రం సౌత్‌ కరోలినాలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్‌ ట్యూస్‌ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు.

వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్‌ అభ్యర్థిత్వానికి ట్రంప్‌ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్‌ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్‌ ప్రైమరీల్లో ట్రంప్‌ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement