నిబంధనల మేరకు ధాన్యం తూకం వేయాలి | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు ధాన్యం తూకం వేయాలి

Published Sat, Apr 20 2024 1:55 AM

విద్యార్థులను అభినందిస్తున్న   డీఈవో జగన్మోహన్‌రెడ్డి
 - Sakshi

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని సిరికొండ, దూలూర్‌, బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ రాంబాబు పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, తూకం వేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. నిబంధనల మేరకు ఆరబెట్టిన ధాన్యం తూకం వేయాలని, అదనంగా తూకం వేస్తే ని ర్వాహకులపై చర్యలుంటాయన్నారు. ఆయన వెంట ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

నేడు మార్కెట్‌యార్డుకు సెలవు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల మార్కెట్‌ యార్డుకు శనివారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్‌ కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు. యార్డుకు అత్యధికంగా ధాన్యం రావడంతో అడ్తీ, ఖరీదుదారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి సోమవారం కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని, రైతులు గమనించాలని కోరారు.

పంటల పరిశీలన

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల రూరల్‌ మండలం పొలాస వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం శుక్రవారం రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామంలో నువ్వులు, పెసర, కూరగాయల తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా రై తులకు పలు సూచనలు చేశారు. నువ్వుల రకా ల్లో జేసీఎస్‌–1020, జేసీఎస్‌–2454, శ్వేత రకా ల్లో విత్తనోత్పత్తి ఎలా సాగుతుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిరు సంచుల దశలో ఉన్న నల్లగింజ రకం జేసీఎస్‌–3287 ను వ్వుల తోటలను పరిశీలించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ పద్మజ, బలరాం, రజి నీదేవి, స్వాతి, శ్రీలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి

జగిత్యాల: విద్యార్థులు చిన్నతనం నుంచే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పద్ధతులు అలవర్చుకోవాలని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన వివిధ పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చి న విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాసరచనలో జెడ్పీహెచ్‌ఎస్‌ ధరూర్‌ క్యాంప్‌నకు చెందిన సురేంద్ర, స్లోగన్‌ రైటింగ్‌లో ఆంజనేయులు, డ్రాయింగ్‌ పోటీల్లో రామన్నపేటకు చెందిన వర్షిని ప్రథమస్థానం సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్‌రావు, సెక్టోరియల్‌ అధికారి కొక్కుల రాజేశ్‌, పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

వాహనాలకు ఇన్సూరెన్స్‌ చేయించాలి

జగిత్యాలక్రైం: పాఠశాలల వాహనాలకు ఇన్సూరెన్స్‌ తప్పనిసరి చేయించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, ప్రతి పాఠశాల వాహనానికి ఇన్సూరెన్స్‌, డ్రైవర్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండేలా యా జమాన్యాలు చూసుకోవాలన్నారు. ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంవీఐలు రామారావు, వెంకన్న, ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.

రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు
1/3

రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు

వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు
2/3

వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

నువ్వుల పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
3/3

నువ్వుల పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

Advertisement
Advertisement