కొనుగోలు కేంద్రాలు మూసేయొద్దు | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలు మూసేయొద్దు

Published Tue, Apr 23 2024 8:25 AM

వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులు - Sakshi

జనగామ: కొనుగోలు కేంద్రాల్లో సరుకు లేకున్నా సెంటర్లను ఎట్టి పరిస్థితుల్లో మూసి వేయవద్దు.. ప్రతి కేంద్రంలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌.ప్రసాదరావు అన్నారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్‌ నుంచి వ్యవసా య, మార్కెటింగ్‌ శాఖల డైరెక్టర్లు మూర్తి, ప్రశాంత్‌లతో కలిసి అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, అకాల వర్షాల సమయంలో ఆరబోసిన ధాన్యం తడవకుండా సెంటర్‌ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. మార్కెటింగ్‌, సివిల్‌ సప్లయీస్‌, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ మాట్లాడుతూ జిల్లాలో 195 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశామని, ఇప్పటి వరకు 5,192 రైతుల వద్ద 28,840 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు తరలించినట్లు చెప్పారు. ప్రతి సెంటర్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. వీసీలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ ప్రసాద్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి నరేంద్ర, వ్యవసాయ శాఖ అధికారి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సివిల్‌ సప్లయ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

ప్రసాదరావు

Advertisement

తప్పక చదవండి

Advertisement