బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

Published Fri, Apr 19 2024 1:45 AM

ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, గ్రామస్తులు 
 - Sakshi

గట్టు: బాల్యవివాహలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి అన్నారు. గురువారం మండలంలోని బల్గెరలో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల సంరక్షణ చట్టాలు, బాల్య వివాహలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. బాల్య వివాహం చేస్తునట్లు తెలిస్తే గ్రామంలో ఉండే బాలల పరిరక్షణ కమీటీకి లేదా 100 లేదా 1098 సమాచారం అందించాలని సూచించారు. బాలల లైంగిక వేధింపుల చట్టం 2012 గురించి ఆమె వివరాలు తెలియజేశారు. సీడీపీఓ కమలాదేవీ మాట్లాడుతూ సామాజిక మాద్యమాల వల్ల పిల్లలు చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు కేవలం మంచి విషయాల కోసం మాత్రమే పిల్లలు ఫోన్లు ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళా రక్షణ చట్టాలు, 181, 1098 టోల్‌ఫ్రీ నంబర్లపై ఆమె అవగహన కల్పించారు. అనంతరం బేటీ బచావో–బేటీ పఢావో పై ప్రతిజ్ఞ చేయించారు. డీసీపీఓ నర్సింహులు, జోష్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement