జీవన్‌రెడ్డే వ్యవసాయ మంత్రి! | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డే వ్యవసాయ మంత్రి!

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే ఇండియా కూటమి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ మంత్రిని చేసే బాధ్యత నాదేనని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర మంత్రిగా పసుపుబోర్డు తీసుకువస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోరాటం చేసి పసుపు బోర్డు తెస్తారన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఓటములు గెలుపునకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ కొడంగల్‌లో కక్ష గట్టి వందల మంది పోలీసులతో అరెస్టు చేసి తనను అణగదొక్కడానికి ప్రయత్నించినట్లు గుర్తుచేశారు.

ఎమ్మెల్యేగా ఓటమి చెందిన మూడునెలల్లోనే మల్కాజ్‌గిరిలో పోటీచేసి గెలుపొందానన్నారు. సమస్యలపై పార్లమెంట్‌ పోరాటం చేయడంతో రాహుల్‌గాంధీ తనను పీసీసీ అధ్యక్షుడి చేశారని తెలిపారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓటమి చెందారని పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందుతారని, దీంతో కేంద్రమంత్రి పదవి లభిస్తుందన్నారు.

ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని..

2014 ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని కవిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వరి, ఎర్రజొన్న, పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఐదేళ్లు మోసం చేశారన్నారు. దీంతో 178 మంది రైతులు 2019 ఎన్నికల్లో పోటీ చేసి కవితను ఓడించారని పేర్కొన్నారు. అప్పుడు ఎంపీగా అర్వింద్‌ను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండ్‌పేపర్‌ రాసిచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా ఆయన కూడా రైతులు మోసం చేశారన్నారు. ప్రధాని బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఎక్కడ ఏర్పాటు చేస్తామనే స్పష్టత ఇవ్వలేదన్నారు. స్పైసిస్‌ బోర్డు ఏర్పాటు చేసి.. పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మరో కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. తమను నిర్లక్ష్యం చేసిన వారికి రైతులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వయంగా రైతు అయిన జీవన్‌రెడ్డి గెలిపిస్తే రైతాంగం సమస్యలను పరిష్కరిస్తారని.. అందుకోసం ఆయన నిజామాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. పంజాబ్‌, హర్యానా రైతులు కేంద్రం తెచ్చిన నల్లచట్టాలపై 16 నెలలపాటు పోరాటం చేశారని గుర్తు చేశారు. దీంతో కేంద్రం చట్టాలపై వెనక్కి తగ్గిందన్నారు. అంతటి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం గల రైతులు ఈ ప్రాంత రైతులని పేర్కొన్నారు. ఇందూరు రైతులకు పంటలు ఎలా పండించాలో తెలుసునని.. అలాగే రైతులను పట్టించుకోని పార్టీలకు ఎలా వాతలు పెట్టాలో కూడా తెలుసునన్నారు.

షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తాం

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని సెప్టెంబర్‌ 17లోపు తెరిపిస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు. ఇందుకోసం సబ్‌ కమిటీ వేశామని.. మంత్రి శ్రీధర్‌బాబు రైతులను కలిసి మాట్లాడారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఫ్యాక్టరీలను తెరిపించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశం డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఆడ్లూరి లక్ష్మణ్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర మినరల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, కాంగ్రెస్‌ నియోజవర్గ ఇన్‌చార్జిలు రవీందర్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, నర్సింగ్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, అరికెల నర్సారెడ్డి, ఆకు ల లలిత, కాంగ్రెస్‌ నగరాధ్యక్షుడు కేశవేణు, కాంగ్రెస్‌ నేతలు బాడ్సిశేఖర్‌ గౌడ్‌, డాక్టర్‌ కవితారెడ్డి, ఏబీ శ్రీనివాస్‌రెడ్డి(చిన్నా), పూర్ణచందర్‌రావు, సాయిరెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ

రైతాంగ సమస్యలపై పోరాడేందుకే నిజామాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు

షుగర్‌ ఫ్యాక్టరీ పేరిట కవిత

రైతులను మోసగించారు

ఎంపీ అర్వింద్‌ పసుపుబోర్డు

హామీని నెరవేర్చలేదు

పసుపుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత లేదు

రైతులను మోసం చేసిన వారికి

బుద్ధి చెప్పాలి

జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి

‘నా తెలంగాణ, కోటి రతనాల వీణ’ అని దాశరథి ఇందూరు జైలు గోడలపై రాసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పో షించిన నారాయణరెడ్డిది కూడా ఈ గడ్డనేన్నా రు. తెలంగాణ ఉద్యమం కోసం బంగారం అమ్మి ఇచ్చిన సదాలక్ష్మి ఈ గడ్డకు చెందిన మహిళనేనన్నారు. ఈశ్వరీబాయి, అర్గుల్‌ రాజారాం లాంటి నేతలు ఈ ప్రాంతానికి చెందినవారేనన్నారు. జాతీయస్థాయిలో రాణిస్తున్న మలావత్‌ పూర్ణ, బాక్సర్‌ నిఖత్‌జరీన్‌ కూడా నిజామా బాద్‌వాసులేని చెప్పారు.

1/1

Advertisement
Advertisement