‘ప్రత్యేక నిఘా పెట్టాలి’ | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక నిఘా పెట్టాలి’

Published Sat, Apr 20 2024 1:50 AM

-

ఆసిఫాబాద్‌అర్బన్‌: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై ప్రత్యేక ని ఘా ఉంచాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ సురేశ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీస్‌ అ ధికారులతో సర్కిల్‌ వారీగా నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని తెలిపారు. చెక్‌పోస్టుల్లో నిరంతరం తనిఖీలు చేయడంతో పాటు నదీ తీర ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్‌ సిబ్బందితో నిఘా పెంచాలని ఆదేశించారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా పరిమితికి మించి నగదు తీసుకువెళ్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని, సీజ్‌ చేసిన నగదును డిస్ట్రిక్‌ రిడ్రీసల్‌ కమిటీకి అప్పగించాలని పేర్కొన్నా రు. ప్రజలంతా ఓటు వినియోగించుకునేలా వారి లో భరోసా కల్పించాలని, గ్రామాల్లో సిబ్బంది రెండురోజులకోసారి తిరుగుతూ గ్రామ సమాచారంతో పాటు అక్రమ రవాణపై నిఘా ఉంచాలని తెలిపా రు. నేర నియంత్రణ, నేర ఛేదనకు ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాలు, కమ్యునిటీ పోలీసింగ్‌ ద్వారా వాటి ప్రాముఖ్యతను తెలియజేసి గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) ప్రభాకర్‌రావ్‌, డీఎస్పీలు సదయ్య, కరుణాకర్‌, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement