పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి | Megastar Chiranjeevi Conferred With Padma Vibhushan Award | Sakshi
Sakshi News home page

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

Published Thu, May 9 2024 7:29 PM | Last Updated on Thu, May 9 2024 8:02 PM

Megastar Chiranjeevi Conferred With Padma Vibhushan Award

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని మెగాస్టార్‌ చిరంజీవి అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా  మనదేశంలో రెండో అత్యన్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌కు దక్కడంతో తెలుగువారందరూ సంతోషిస్తున్నారు. నేడు (ఏప్రిల్‌ 9న) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు. 

దీంతో పద్మవిభూషణ్‌ చిరంజీవి అయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హజరయ్యారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement