Padmavibhusan Award
-
పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా మనదేశంలో రెండో అత్యన్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ మెగాస్టార్‌కు దక్కడంతో తెలుగువారందరూ సంతోషిస్తున్నారు. నేడు (ఏప్రిల్ 9న) రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. దీంతో పద్మవిభూషణ్ చిరంజీవి అయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హజరయ్యారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. -
చిరంజీవికి అభిమాని శుభాకాంక్షలు.. అన్నింటిలో ఇదీ చాలా ప్రత్యేకం
దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని వరించిన రోజు నుంచి ఆయనకు ఎందరో శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా ఎందరో ప్రముఖులు అభినందనలు తెలిపారు. త్వరలో ఒక మెగా ఫంక్షన్‌ను ఏర్పాటు చేసి చిరంజీవిని గౌరవించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. నటుడిగా ఎందరినో అభిమానులుగా మార్చుకున్న చిరంజీవికి 2006లో పద్మ భూషణ్ అవార్డు వరించింది. తాజాగా మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఓ అభిమాని వినూత్నంగా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్‌లోని బిగ్స్క్రీన్పై చిరంజీవి ఫోటో ప్రదర్శించాడు. ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్‌కు శుభాకాంక్షలు అంటూ తెలిపాడు. ఇప్పటికే ఎందరో ప్రముఖులు చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ బాలకృష్ణ, రజినీకాంత్, అమితాబ్, కమల్ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికీ అభినందించకపోవడంపై చిరు ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం షూటింగ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. Fans Congratulated MegaStar Dr. @KChiruTweets garu from the Times Square, USA on receiving prestigious #PadmaVibhushan 😍#PadmaVibhushanChiranjeevi #PeoplesPadma pic.twitter.com/VEhJI7IfKl — KB (@Shatagni) January 30, 2024 -
ప్రేమ, ఆదరణే నిజమైన మూలధనం
- మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ - పద్మవిభూషణ్ అవార్డు గ్రహితను ఘనంగా సన్మానించిన గవర్నర్ ముంబై సెంట్రల్: ప్రజల ప్రేమ, ఆదరణే జీవితానికి నిజమైన మూలధనమని మాజీ ఉపప్రధాన మంత్రి, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అన్నారు. పద్మవిభూషన్ అవార్డు పొందిన సందర్భంగా ఆయనను గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కె.సి. కాలేజీ ఆడిటోరియంలో శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం అద్వానీ మాట్లాడుతూ పార్లమెంట్ హౌస్‌లో కూర్చున్న తనకు అన్ని పార్టీల సభ్యుల నుంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. అద్వానీ తన జీవితంలో అందరి నుంచి మర్యాద, గౌరవం పొందారని గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. తన కర్తవ్య నిర్వహణలో ఎలాంటి లోపం చూపని అద్వానీ, దేశంలో నిజమైన ఐరన్మాన్ అని గవర్నర్ ప్రశంసించారు. ‘హైదరాబాద్ విముక్తి దినోత్సవ’ క్రెడిట్ అద్వానీదే ‘1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ‘హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్య్రం లభించింది. స్వతంత్రం లభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1998లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సెప్టెంబర్ 17 రోజును ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవాలని అద్వానీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత మరాఠ్వాడా, కర్నాటక్‌లో అదే రోజున ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం మొదలుపెట్టారు’ అని గవర్నర్ విద్యాసాగర్ రావు వెల్లడించారు. కార్యక్రమంలో ఫినోలెక్స్ సంస్థాపకుడు ప్రహ్లాద్ ఛాబరియా, బ్లూ క్రాస్ లేబారేటరీ అధ్యక్షురాలు నిశ్చల్ ఇసరానీ, సామాజిక సేవకురాలు సమున్ తులసీయాని తదితరులు పాల్గొన్నారు.