ప్రశాంత ఎన్నికలకు.. పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు.. పకడ్బందీ ఏర్పాట్లు

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ● పండుటాకులకు ఇంటి వద్దే ఓటింగ్‌ సౌకర్యం ● పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు ● ‘సాక్షి’తో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో లోక్‌సభ ఎ న్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలన్నింటిలోనూ వెబ్‌ కాస్టింగ్‌తోపాటు పట్టిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..

సర్వం సిద్ధం..

జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చే సేలా ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నా యి. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల పరిధి లోని పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత శాసనసభ ఎ న్నికల కంటే అదనంగా 79 యాగ్జలరీ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహాయ పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, మూత్రశాలలు, నీడ తదితర వసతులు ఉండేలా చర్యలు చే పట్టాం. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. పోలింగ్‌కు నాలుగు రోజులు ముందుగానే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. తద్వారా పోలింగ్‌ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగదు.

సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి...

జిల్లాలో మొత్తం 676 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. అందులో 64 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. వీటితోపాటు మావోయిస్టు ప్రభావిత(ఎల్‌డబ్ల్యూఈ) ప్రాంతాల్లో 22, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి నెట్‌వర్క్‌ సౌకర్యం లేనివి 63 పో లింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర రక్షణ బలగాల ద్వారా నిఘా ఉంటుంది. మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షిస్తారు. అన్ని సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎల్‌డబ్ల్యూఈ, షాడో పోలింగ్‌ కేంద్రాలు, అర్బన్‌ ప్రాంతాల్లోని కేంద్రాల్లో కూడా వెబ్‌కాస్టింగ్‌ సౌకర్యం ఉంటుంది. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 80 శాతం వాటిల్లో వెబ్‌కాస్టింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు

తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీటి వసతి, విద్యుత్‌, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, బల్లలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు కచ్చితంగా ఉంటాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌కు ఇబ్బంది ఉండదు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందడంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా ఉండదు. ఎన్నికల సంఘం ఎన్‌ఐసీ నుంచి ఒక యాప్‌ ఇచ్చారు. దాని ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఎపిక్‌ నంబర్‌తో సహా వివరాలు పొందుపరిస్తే వారి ఓటు ఎక్కడ ఉందో అక్కడ డేటాతో సహా క్యాప్చర్‌ అవుతుంది. గతంలో మాన్యువల్‌గా ఉండటంతో కొద్దిగా గందరగోళానికి గురయ్యారు. ఈసారి ఆన్‌లైన్‌ కావడంతో ఎవరు ఎక్కడ ఓటేసేందుకు ఎంపిక చేసుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వివరాలు నమోదు చేసుకునేందుకు ఉద్యోగులకు మే 3 నుంచి 8 వరకు సమయం ఇచ్చాం.

పోలింగ్‌ శాతం పెంచే దిశగా..

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటుహక్కు అత్యంత కీలకం. ఓటు వజ్రాయుధమని ‘స్వీప్‌’ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాం. యువత అధికంగా ఉన్న కళాశాలలు, పది మంది గుమిగూడే ప్రదేశాల్లో ఓటు వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రచార సాధానల ద్వారా కూడళ్లలోని సిగ్నళ్ల వద్ద ప్రచారం చేస్తున్నాం.

గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేకం..

గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యే క క్యూలైన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో మాదిరిగా ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, మహిళా, దివ్యాంగ పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. ఈసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులే ఇంటి వద్ద ఓటేసేందుకు అర్హులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 దాటిన వారికి కూడా అనుమతి ఉండేది. ఇప్పటివరకు 85 ఏళ్లు దాటిన వృద్ధులు 80 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

1/1

Advertisement
Advertisement