ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు పాటించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు పాటించాలి

Published Wed, May 8 2024 7:40 AM

ఎన్ని

మహబూబాబాద్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు డేవిడ్‌, లెనిన్‌ వత్సల్‌ టోప్పో వివిధ శాఖల నోడ్‌ అధికారులతో కలసి ఈనెల 13న నిర్వహించే పోలింగ్‌ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

కొత్తగూడ: మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి ఎన్నికల పరిశీలకుడు రితిక్‌రాజ్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్నికల సమయంలో సిబ్బందికి కావాల్సిన వసతులు, భద్రత, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారులకు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రితిక్‌ రాజ్‌ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర, ములుగు అదనపు కలెక్టర్‌ శ్రీజ, ములుగు ఎస్డీపీఓ రవీందర్‌, సీఐ బాబూరావు, తహసీల్దార్‌ రమాదేవి, కొత్తగూడ, గంగారం ఎస్సైలు దిలిప్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు

సహకరించాలి

డోర్నకల్‌: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని మహబూబా బాద్‌ డీఎస్పీ తిరుపతిరావు కోరారు. డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ, సీరోలు మండలం అందనాలపాడు గ్రామాల్లో డోర్నకల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలు, అక్ర మ వ్యాపారాలతో ఇబ్బందులపాలవుతారని తెలిపారు. కార్యక్రమంలో డోర్నకల్‌ సీఐ ఉపేందర్‌రావు, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.

కేయూ బీటెక్‌

సెమిస్టర్‌ పరీక్షలు షురూ

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో ఇంజనీరింగ్‌ బీటెక్‌ నాల్గోవ సంవత్సరం చివరి సెమిస్టర్‌ పరీక్షలు మంగళశారం ప్రారంభమయ్యాయి. కేయూలోని ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆచార్య నర్సింహాచారి , అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక పరిశీలించారు.

కాళేశ్వరంలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి పూజలు

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి, కాళేశ్వరం జ్యూడీషియల్‌ కమిషన్‌ చైర్మన్‌ పినాకి చంద్రఘోష్‌–డెబ్జాని దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయ రాజగోపురం వద్దకు రాగా ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. వారికి అర్చకులు స్వామివారి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం శ్రీశుభానందదేవి(పార్వతీ) అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ పీసీ ఘోష్‌ దంపతులను ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణౖమూర్తిశర్మ స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని దంపతులకు బహూకరించారు. ఆయనతో పాటు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు వేర్వేరుగా సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు.

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు పాటించాలి
1/1

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు పాటించాలి

Advertisement
Advertisement