భయపెడితే భయపడతారనుకున్నావా?.. పక్కకెళ్లి ఆడుకో.. హౌస్‌లో మాటల యుద్ధం! | Sakshi
Sakshi News home page

Bigg Boss latest Promo: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్!

Published Thu, Nov 2 2023 1:01 PM

Amardeep and Priyanka Fight Between In Bigg Boss latest Promo - Sakshi

తెలుగువారి రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తొమ్మిదో వారం హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్‌లో టాస్కుల పర్వం మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్‌ రేసు మొదలెట్టేశాడు బిగ్‌బాస్.  ఈ వారం కెప్టెన్సీ కంటెండ‌ర్ అయ్యేందుకు ఓ గేమ్‌ ఇచ్చాడు. దీని కోసం ఇంటిస‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విభ‌జించాడు. వీర‌సింహాలు టీమ్‌లో యావ‌ర్‌, గౌత‌మ్‌, భోలె, తేజ‌, శోభా, ర‌తిక ఉండ‌గా.. మిగిలిన‌వారంతా గ‌ర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు.

(ఇది చదవండి: వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమ‌ర్‌పై మ‌ళ్లీ విషం క‌క్కిన శివాజీ)

మొద‌ట బాల్స్ టాస్కు పెట్టిన బిగ్‌ బాస్‌.. దాని ఫ‌లితాల‌ను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. త‌ర్వాత ప‌వ‌ర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. ఇది గెలిచిన టీమ్‌కు ఒక స్పెష‌ల్ ప‌వ‌ర్ ల‌భిస్తుంద‌ని చెప్పాడు. మొద‌ట జంపింగ్ జ‌పాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీర‌సింహాలు టీమ్ గెలవ‌డంతో.. అవతలి టీమ్‌లోని ఒక‌రిని గేమ్ నుంచి తొల‌గించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీంతో అంద‌రూ చ‌ర్చించుకుని పల్లవి ప్ర‌శాంత్‌ను గేమ్ నుంచి తొలగించారు.

తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ మరో ఛాలెంజ్‌తో ఎపిసోడ్ మొదలైంది. అమర్‌దీప్, కెప్టెన్ గౌతమ్‌ పరుగుత్తుకెంటూ వెళ్లి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ విషయంలో రతికా, అమర్‌ దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎందుకు కింద పడేశావ్ అంటూ అమర్‌ను రతికా ప్రశ్నించగా.. నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతిసారి వెధవ పని చేయడం నీకు అలవాటు అనడంతో.. నువ్వు చేసే పనులతో నన్ను పోల్చొద్దు అని అమర్ కౌంటరిచ్చాడు. దీంతో రతికా కోపంతో మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమర్ సైతం నువ్వు కూడా అంటూ రెచ్చిపోయాడు. భయపెడితే భయపడతారనుకున్నావా? పక్కకెళ్లి ఆడుకో.. వచ్చి నా బ్యాగ్ లాగడం కాదు.. నీ బ్యాగ్ లాగినవాళ్ల దగ్గరికి వెళ్లి లాగు అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ ఇచ్చిన బ్రేక్‌ ఫాస్ట్‌ ఛాలెంజ్‌లో అమర్, శోభా తలపడగా.. ఇందులో అమర్‌ విన్ అ‍య్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. మరీ ఫైనల్‌గా ఏ టీమ్‌ కెప్టెన్సీ కంటెండ‌ర్ నిలిచిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. 

(ఇది చదవండి: కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!)

Advertisement
 
Advertisement
 
Advertisement