ఇట్స్‌ అఫీషియల్‌.. జైలర్‌ OTT రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. | Rajinikanth Jailer Movie To Premiere On Prime Video On This Date - Sakshi
Sakshi News home page

Jailer OTT Release Date: సర్‌ప్రైజ్‌ ఇచ్చిన జైలర్‌... ఓటీటీ డేట్‌ కన్ఫామ్‌, కానీ ప్లాట్‌ఫామ్‌ మారింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sat, Sep 2 2023 11:14 AM

Amazon Prime Announced Jailer OTT Release Date - Sakshi

నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి.. అని తమన్నా స్టెప్పులతో రెచ్చిపోయింది. జైలర్‌ సినిమా రిలీజ్‌కు ముందు ఈ పాట సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది. జైలర్‌ థియేటర్లలోకి వచ్చేశాక సినిమా చూసి రజనీ ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. తలైవా ఈజ్‌ బ్యాక్‌ అని కాలర్‌ ఎగరేసి మరీ సంబరాలు చేసుకున్నారు.

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జైలర్‌. రమ్యకృష్ణ, మీర్నా మీనన్‌, జయం రవి కీలక పాత్రల్లో నటించారు. శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రల్లో మెరిసి సినిమా సక్సెస్‌లో భాగమయ్యారు.

ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టి అందరినీ అబ్బురపరిచింది. సినిమా ఓటీటీలోకి రావాలయ్యా.. జైలర్‌ కావాలయ్యా అని అభిమానులు ఓటీటీ రిలీజ్‌ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మొదట సన్‌ నెక్స్ట్‌లో ప్రసారం అవుతుందని అందరూ ఊహించారు, హిందీ వర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని ప్రచారం జరిగింది. కట్‌ చేస్తే.. అమెజాన్‌ ప్రైమ్‌ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించి రూమర్స్‌కు స్వస్తి పలికింది. మొత్తానికి జైలర్‌ ఓటీటీ విడుదల తేదీతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. వారంలోపే ఓటీటీ సందడి చేయనుందని తెగ ఎగ్జయిట్‌ అవుతున్నారు. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన జైలర్‌ ఓటీటీలోనూ దుమ్ము దులపడం ఖాయం అని ఫిక్సయిపోతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement