
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయని వివరించింది. రానున్న మూడు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులున్నట్లు వెల్లడించింది. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్, హనుమకొండలో 23.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment