
విల్ స్మిత్ నటించిన హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘ఐయామ్ లెజెండ్’. ఫ్రాన్సిన్స్ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఐ యామ్ లెజెండ్ 2’ని దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించారు. విల్ స్మిత్‌తో పాటు మైఖేల్ బి జోర్డాన్ కూడా ఈ సీక్వెల్‌లో నటించనున్నారు. ఈ విషయం గురించి జోర్డాన్ మాట్లాడుతూ– ‘‘ఇంకా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను.
అయితే విల్ స్మిత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఆనందంగా ఉంది. విల్‌తో కెమెరా ముందు నటించే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ‘ఐ యామ్ లెజెండ్ 2’కి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment