Nagarjuna: Bangarraju Movie Wrap The Shooting With Peppy Mass Song - Sakshi
Sakshi News home page

Bangarraju Movie: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్‌ పూర్తి.. నాగార్జున ట్వీట్‌

Published Fri, Dec 24 2021 8:53 AM

Bangarraju Movie Wrap The Shooting With Peppi Mass Song - Sakshi

Bangarraju Movie Wrap The Shooting: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’.  'సోగ్గాడు మళ్లీ వచ్చాడు' అనేది సినిమా క్యాప‍్షన్‌. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజులో చైకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. నాగ్‌తో రమ్య కృష్ణ మరోసారి జతకడుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే రిలీజ్‌ అయిన ‘వాసివాడి తస్సాదియ్యా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ విశేషంగా అలరిస్తోంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్‌ 'ఫరియా అబ్దుల్లా' కనువిందు చేసింది. 

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. బంగార్రాజు సినిమా షూటింగ్‌ గురువారంతో (డిసెంబర్‌ 23) పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నాగ చైతన్య, కృతీ శెట్టిలపై తీసిన పెప్పీ మాస్‌ సాంగ్‌తో చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా ‘‘మరో పెప్పీ డ్యాన్స్‌ నంబర్‌ రెడీ అవుతోంది. షూటింగ్‌ చివరి రోజు ఇది. పండగలాంటి సినిమా. ‘బంగార్రాజు’ కమింగ్‌ సూన్‌’’ అని గురువారం నాగార్జున ట్వీట్‌ చేశారు. చైతన్య, కృతీల ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ఇదీ చదవండి: బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్‌.. 'నా కోసం నువ్వు' అంటూ

Advertisement
 
Advertisement
 
Advertisement