అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్‌' టీమ్‌ భారీ విరాళం | Sakshi
Sakshi News home page

అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్‌' టీమ్‌ భారీ విరాళం

Published Sun, Jan 21 2024 11:23 AM

Hanuman Movie Makers Donate Ayodhya Temple Trust - Sakshi

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్‌ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్‌లో విడుదలైన హనుమాన్‌ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ల సునామీ క్రియేట్‌ చేస్తుంది.

రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్‌' టీమ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది.  ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్‌లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మేకర్స్  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి  ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్‌ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. 

గూస్‌బంప్స్‌ వచ్చాయి: నాగా చైతన్య
హనుమాన్‌ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్‌ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్‌ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ పెట్టారు. హనుమాన్‌ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని  డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్‌బంప్స్‌ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement