రామ్‌ చరణ్‌తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ

Published Thu, Feb 22 2024 8:23 PM

Janhvi Kapoor Clarified Ram Charan Movie - Sakshi

రామ్‌ చరణ్‌తో జాన్వీ కపూర్‌ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్దిరోజుల క్రితం బోనీకపూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవర చిత్రం తర్వాత టాలీవుడ్‌లో మరొక ఛాన్స్‌ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్‌ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్‌ ఇలా స్పందించారు. ' నా సినిమాల అప్డేట్స్‌ గురించి మా నాన్న (బోనీ కపూర్‌) పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' మాత్రమే చేస్తున్నాను.' అని చెప్పారు.

‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా (‘RC 16’ వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్‌ పేరు ప్రముఖంగా ఉంది.

దీంతో ఈ విషయం గురించి బోనీకపూర్‌ను ప్రశ్నించగా.. రామ్‌ చరణ్‌తో జాన్వీ సినిమా చేస్తుందని ప్రకటించారు. ఆపై కోలీవుడ్‌ హీరో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. కానీ,  బోనీకపూర్‌ ఈ విషయాన్ని వెల్లడించడంతో గత కొద్దిరోజులగా వైరల్‌గా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందనున్న  ‘ఆర్‌సీ 16’ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement