కార్తీ 'జపాన్‌' గుర్తుండేలా.. వాళ్లకు రూ 1.25 కోట్ల విరాళం | Sakshi
Sakshi News home page

Karthi: కార్తీ 'జపాన్‌' గుర్తుండేలా.. వాళ్లకు రూ 1.25 కోట్ల విరాళం

Published Tue, Oct 31 2023 1:51 PM

  Japan Actor Karthi Donates 1.25 Crore For Welfare Activities - Sakshi

కార్తీక్ శివకుమార్... ముద్దుగా కార్తీ అని అభిమానులు పిలుస్తుంటారు.. తమిళనాడులో తనకు ఏ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఉన్నారో టాలీవుడ్‌లో కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. వరుస హిట్‌ సినిమాలు చేస్తూ.. తన అభిమానులకు ట్రీట్‌ ఇస్తున్న కార్తీ.. గతేడాది పొన్నియన్‌ సెల్వన్‌, సర్దార్‌ సినిమాలతో మెప్పిస్తే.. ఈ ఏడాది పొన్నియన్‌ సెల్వన్‌ 2 తో  అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దివాళి సందర్భంగా కార్తీ నటించిన 25వ సనిమా జపాన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ కెరియర్‌లో ఈ సినిమా ఒక బెంచ్‌ మార్క్‌ లాంటిది. కాబట్టి ఈ సినిమా తన అభిమానులకు మరింత స్పెషల్‌గా ఉండాలని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.

(ఇదీ చదవండి: ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి.. నేను లోకేష్‌ కనగరాజ్‌ కాదు: సాయి రాజేష్‌)

తన అన్నయ్య సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని కార్తీ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా రూ. 1.25 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, పేద వారికి అన్నదానాలు ఏర్పాటుచేయడానికి ఈ భారీ మొత్తాన్ని వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. జపాన్‌ తన కెరియర్‌లో 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, 25 పాఠశాలను సెలెక్ట్‌ చేసి ఒక్కో పాఠశాలకు రూ. లక్ష రూపాయలు. అలాగే  25 ఆస్పత్రులకు 25 లక్షలు విరాళంగా అందజేశారు.

మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు పేదవారికి అన్నదానం చేయాలని ఆయన ఏర్పాట్లు చేశారు. వీటిలో ఇప్పటికే అన్నదానం కార్యక్రం జరుగుతుంది. కనీస అవసరాల కోసం 25 ఆస్పత్రులు,స్కూళ్లను గుర్తించి వాటికి లక్ష రూపాయల చొప్పున కార్తీ సాయం చేయనున్నారు.  రాజు మురుగన్ దర్శకత్వంలో వస్తున్న జపాన్‌ సినిమాలో కార్తీ దొంగగా నటిస్తున్న విషయం తెలిసిందే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 12న దివాళీ సంబర్భంగా విడుదల కానుంది.

Advertisement
Advertisement