కెవ్వు కార్తీక్‌ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..' | Sakshi
Sakshi News home page

జబర్దస్త్‌ కమెడియన్‌ ఇంట విషాదం.. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ..

Published Thu, May 16 2024 12:10 PM

Kevvu Karthik Mother Lost Her Life In Battling with Cancer

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక్‌ తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్తను కమెడియన్‌ గురువారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'అమ్మా.. గత ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే! 

కంటికి రెప్పలా
మమ్మల్ని కన్నావు.. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ, నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..? 

వారికి పాదాభివందనాలు
మా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభివందనాలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లి ఫోటోను షేర్‌ చేశాడు. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement