నటి రాధపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

నటి రాధపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

Published Thu, Mar 21 2024 6:43 AM

 Sundhara Travels Actress Radha Against Case Filed - Sakshi

కోలీవుడ్‌లో సుందరాట్రావెల్స్‌, అదావతి, మనస్థాన్, కధవరాయన్ త దితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందిన నటి రాధ. నెల్లూరుకు చెందిన రాధ సినిమా అవకాశాల కోసం చెన్నై మకాం మార్చింది. అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తుంది. ఈమెకు తరుణ్‌ అనే కుమారుడు ఉన్నాడు. వీరు చెన్నైలోని సాలిగ్రామంలో నివసిస్తున్నారు. కాగా వీరి ఇంటి సమీపంలో ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు.

కాగా రాత్రి ప్రాన్సిస్‌ ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక వచ్చిన నటి రాధ, ఆమె కుమారుడు తరుణ్‌ అతనిపై దాడి చేసి కొట్టారు. దీంతో ఫ్రాన్సిన్‌ రిజర్డ్‌ తండ్రి డేవిడ్‌ రాజ్‌ నటి రాధ, ఆమె కొడుకు తరుణ్‌పై విరుగంబాక్కమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నటి రాధ ఫ్రాన్సిస్‌ రిజర్డ్‌పై దాడి చేసిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల్లో చోటు చేసుకున్న విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. కాగా ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ ఇంతకు ముందు నటి రాధపై వ్యంగంగా ప్రవర్తించినందుకు గానూ అతనిపై ఇంతకు ముందు ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నటి రాధ, ఆమె కొడుకు ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌పై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాధ గతంలో కూడా పలు వివాధాల వల్ల కోలివుడ్‌ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. భర్తతో గొడవలు,వివాహేతర సంబంధాలు,నిర్మాతల వేధింపులపై ఆమె కామెంట్లు ఇలా పలు విషయాల చుట్టూ ఆమె టాపిక్‌ వైరల్‌గా ఉండేది.

Advertisement
 
Advertisement
 
Advertisement