గుంటూరు, సాక్షి: ప్రజలకు మంచి చేశాం.. కచ్చితంగా పార్టీ ఫునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, పోటీచేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా.. పార్టీ తరఫున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని, ఈ టైంలో పార్ట శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్ జగన్ సూచించారు.
వైఎస్ జగన్‌తో పార్టీ నేతలు.. ‘‘ప్రజలకు మంచి చేశాం, కచ్చితంగా పార్టీ పునర్ వైభవం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు(జగన్‌ను ఉద్దేశించి) చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయి.
.. ఈవీఎం మేనేజ్‌మెంట్ అనుమానాలు, ఈసీ–కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయినా కూడా 40శాతం ఓటింగ్ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణం. గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉన్నాయి.. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుంది.
.. కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టిఉంటుంది. ఈ ఐదేళ్లపాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారు. మాటమీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైఎస్సార్‌సీపీకి ప్రజల మనసులో చోటు ఉంది. పార్టీ పునర్వైభవానికి గట్టి పునాది కూడా ఇదే.
.. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలున్నాయి. మన పార్టీ అనుకూల గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు తెర తీశారు. ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచింది. వైఎస్సార్‌సీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగా భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారు’’ అని నేతలు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాడులు:
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు, వైఎస్ జగన్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదంతో స్వైరవిహారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారు.
పార్టీ నాయకులతో వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు అండగా నిలవండి. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నాం. గవర్నర్‌కు కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment