అనంతపురం: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారు. గురువారం కూడా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. ఉరవకొండలోని కణేకల్లు క్రాస్ వద్ద హోటల్‌లో బుధవారం టీ తాగుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారిగా తల, కాళ్లు, చేతులపై కర్రలతో దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే బందోబస్తులో ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యురాలు ఆశాబీ ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు చొరబడి ఆమె కుమారులు అక్బర్, ఇర్ఫాన్‌లపై దాడి చేశారు. చిలమత్తూరు మండలంలోని వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు టీడీపీ కార్యకర్తలు వెళ్లి దాడులకు తెగబడ్డారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త నరసింహమూర్తిపై దాడి చేసి, తల పగులగొట్టారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగభూషణం ఇంట్లో చొరబడి దాడికి యత్నించారు.
తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్లలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బొమ్మనహాళ్ మండలం దేవగిరిలో సచివాలయం ఆర్చ్‌పై ఉన్న వైఎస్సార్ బొమ్మను ధ్వంసం చేశారు. సచివాలయం, రైతు భరోసా శిలా ఫలకాలను ధ్వంసం చేసేందుకు యతి్నంచగా స్థానికులు అడ్డుకున్నారు. ఉప్పరపల్లిలో సచివాలయం, ఆర్‌బీకే బోర్డులను ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment