ఏపీలో హింసపై సుప్రీంను ఆశ్రయించిన బాధితులు
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై యథేచ్ఛగా దాడులు
గ్రామాలు వీడకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు
ఆస్తుల ధ్వంసం.. మహిళలు, పిల్లలను హింసిస్తున్నారు
పోలీసుల నిర్లిప్తతతో అసాంఘిక శక్తులు పేట్రేగుతున్నాయి
సాక్ష్యాధారాలతో ఈ–మెయిల్ ద్వారా సీజేఐకి ఫిర్యాదు
సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారించాలంటూ అభ్యర్థన
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఈ–మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు.
బాధితుల ఆక్రందన ఇదీ..
⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి.
⇒ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల్లో హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి.
⇒ సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించకుంటే ఈ వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్‌గా స్వీకరించి విచారించాలి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలి.
Comments
Please login to add a commentAdd a comment