Vignesh Shivan Share Cryptic Notes On Instagram Story - Sakshi
Sakshi News home page

Nayanthara-Vignesh Shivan: సరోగసీ వివాదం.. వైరల్‌గా విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌

Published Wed, Oct 12 2022 1:52 PM

Vignesh Shivan Instagram Post Goes Viral Amid Surrogacy Controversy - Sakshi

సౌత్‌ స్టార్‌ కపుల్‌ నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి ఇద్దరు కవలలు జన్మించారంటూ విఘ్నేశ్‌ శివన్‌ ఆదివారం(అక్టోబర్‌ 9న) సోషల్‌ మీడియా వేదికగ ప్రకటించాడు. ఈ సందర్భంగా నయన్‌-విఘ్నేశ్‌ చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్‌ చేశాడు. దీంతో ఈ జంటకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. వీరు తల్లిదండ్రులు అయిన వ్యవహరంపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

పెళ్లయిన 5 నెలలకే పిల్లలు జన్మించడంతో ఈ జంట సరోగసీని మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సరోగసీ ద్వారానే నయన్‌ తల్లయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు నయన్‌ దంపతులు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వారు భారత చట్టాన్ని ఉల్లంఘించారంటూ నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహరంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. స‌రోగ‌సీపై నయనతార-విఘ్నేశ్‌ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌హ్మణియ‌న్ పేర్కొన్నారు.

ఈ వివాదంపై ఇప్పటి వరకు నయన్‌-విఘ్నేశ్‌లు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నయనతార భర్త విఘ్నేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కోట్స్‌ చర్చనీయాంశం అవుతున్నాయి. ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపిక పట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అంటూ ఇన్‌స్టాలో స్టోరి షేర్‌ చేశాడు. మీ గురించి ఆలోచిస్తూ మీ మంచి కోరే వ్యక్తుల పట్ల మీరు శ్రద్ద చూపించండి. అలాంటి వారే మీ వాళ్లు’ అంటూ మరో కోటేషన్‌ షేర్‌ చేశాడు. ప్రస్తుతం విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సరోగసీ వివాదంపై నయన్‌ దంపతులు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారని, వారిపై విమర్శలు చేస్తున్న వారికి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: 
తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్‌ దంపతులకు షాక్‌!
టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి

Advertisement
 
Advertisement
 
Advertisement