Jayalalitha Death Mystery: Arumuga Swamy Submit Death Report To CM Stalin - Sakshi
Sakshi News home page

Jayalalitha Death Mystery: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్‌ చేతికి రిపోర్టు

Published Sat, Aug 27 2022 12:28 PM

Arumuga swamy Submit Jayalalithaa Death Report To CM Stalin - Sakshi

సాక్షి, చైన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్‌ నివేదిక కీలకంగా మారింది. కాగా, జయలలిత మృతిపై రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను సీఎం స్టాలిన్‌కు అందజేశారు. 600 పేజీలతో కమిషన్‌ రిపోర్టును తయారు చేసింది. ఇక, కమిషన్‌ ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత నివేదిక అందించడం విశేషం. 

అయితే, 2016 సెప్టెంబ‌ర్ 22వ తేదీన జయలతిత ఆసుపత్రిలో చేరారు. 2016, డిసెంబ‌ర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో మాజీ జడ్జీ జస్టిస్‌ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కమిషన్‌.. ఐదేళ్ల కాలంలో జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. కమిషన్‌ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు, విధుల్లో ఉన్న చెన్నై పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. అయితే, విచార‌ణ‌లో భాగంగా ఆర్ముగ స్వామి క‌మిష‌న్ సుమారు రెండు వంద‌ల మందిని ప్ర‌శ్నించింది.

ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్‌.. పన్నీర్‌సెల్వానికి బిగ్‌ షాక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement