ఛండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ! | Sakshi
Sakshi News home page

Chandigarh: ఛండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ!

Published Mon, Mar 4 2024 1:57 PM

Chandigarh BJP Won Senior Deputy Mayor Elections - Sakshi

పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత కుల్జీత్ సంధు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. డిప్యూటీ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి రాజిందర్‌ కుమార్‌ శర్మ గెలుపొందారు.

మీడియా దగరున్న సమాచారం ప్రకారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. 

గతంలో మేయర్ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రిసైడింగ్ అధికారిని కోర్టు మందలించింది. అనంతరం డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరు ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్, ఆప్‌లకు 20 మంది కౌన్సిలర్లు ఉండేవారు. వీరిలో ముగ్గురు బీజేపీలో చేరడంతో ‘ఇండియా కూటమి’ కౌన్సిలర్ల సంఖ్య 17కు తగ్గింది. అదే సమయంలో బీజేపీకి అకాలీ, కిరణ్‌ ఖేర్‌ మద్దతు పలకడంతో ఆ పార్టీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి.

Advertisement
Advertisement