
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం పుష్ప-2. ఈ చిత్రం కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ పుష్ప-2పై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే ఇవాళ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. పుష్ప-2లో దాక్షాయణి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అనసూయ పోస్టర్‌ను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన అభిమాన నటికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Wishing the talented @anusuyakhasba a very Happy Birthday ❤🔥
She will be back with #Pushpa2TheRule as the wily 'Dakshayani' 💥
Grand release worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial… pic.twitter.com/AzWpp9fzUT— Pushpa (@PushpaMovie) May 15, 2024
Comments
Please login to add a commentAdd a comment