DMK Oppose Central Hindi Names For Bills Introduced In Parliament - Sakshi
Sakshi News home page

కేంద్రంపై సీఎం స్టాలిన్‌ సీరియస్‌.. కారణం ఇదే..

Published Sat, Aug 12 2023 6:46 PM

DMK Opposed Central Hindi Names For Bills Introduced In Parliament - Sakshi

చెన్నై: హిందీ విషయంలో కేంద్రం​ వర్సెస్‌ తమిళనాడు అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం భారత్‌లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లను అమిత్‌ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇక, ఈ బిల్లులపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సంచలన కామెంట్స్‌ చేసింది.  

ఇక, కేంద్రం బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం భాషా సామ్రాజ్యవాదమని మండిపడ్డారు. ఇది సమైక్య భారత దేశ మూలాలను కించపరచడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమిళంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమిళం అనే పదాన్ని పలకడానికి బీజేపీకి, ప్రధాని మోదీకి హక్కు లేదన్నారు. డీకాలనైజేషన్ పేరుతో రీకాలనైజేషన్ చేస్తున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా తమ గుర్తింపును వెనక్కి నెట్టే ప్రయత్నమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. 

మరోవైపు.. కేంద్రం తెచ్చిన బిల్లులపై పార్లమెంట్‌లో డీఎం ఎంపీ విల్సన్‌ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో విల్సన్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హిందీని దేశమంతటికీ రుద్దుతోందన్నారు. ఈ మూడు బిల్లుల పేర్లను ఇంగ్లిష్‌లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దీంతో, డీఎంకే నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

ఇది కూడా చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్‌ స్ట్రైక్‌ ఒక్కటే మార్గం..'

Advertisement
Advertisement