Gurugram University Dean accused of molesting women professor - Sakshi
Sakshi News home page

మేడం మీరు మోడ్రన్‌ డ్రెస్‌లో బాగుంటారు.. వర్సిటీ డీన్‌ వేధింపులు..

Published Tue, May 2 2023 11:08 AM

Gurugram University Dean Accused Of Molesting Women Professor - Sakshi

దేశంలో మహిళలు, యువతులపై ఏదో ఒక చోట.. వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పనిచేసేచోట, ప్రయాణ సమయాల్లో మహిళలు వేధింపులకు గురువుతూనే ఉన్నారు. తాజాగా ఓ డిపార్ట్‌మెంట్‌ డీన్‌.. మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు వేధింపులకు గురిచేశాడు. విదేశీ దుస్తుల్లో నువ్వు అందంగా ఉంటావ్‌ అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్‌ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ డీన్ ధీరేంద్ర కౌశిక్ పనిచేస్తున్నారు. అదే వర్సిటీలో ఓ మహిళ.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తన్నారు. ఈ క్రమంలో డీన్‌ ధీరేంద్ర.. ఆమెపై కన్నేసి అనుచితంగా ప్రవర్తించాడు. శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ధీరేంద్ర.. ఆమెతో మాట్లాడుతూ.. మీరు మోడ్రన్‌ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తారు. మీ భర్త లేనప్పుడు నన్ను హోట్‌ల్‌లో కలవండి అంటూ కామెంట్స్‌ చేశాడు. అలాగే, పలు సందర్భాల్లో ఆమె ప్రైవేటు భాగాలను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆమె.. తనతో ఇలా ప్రవర్తించవద్దని ధీరేంద్రను కోరింది. అనంతరం.. ఈ విషయాలపై వీసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన నిరాకరించడం గమనార్హం.  

ఇలా, ధీరేంద్ర.. ఆమెను వేధింపులకు గురిచేయడం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఏప్రిల్‌ 28వ తేదీన యూనివర్సిటీ ఆవరణలోని ఒక గదిలో తనను వేధించడంతో ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె.. గురుగ్రామ్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఫిర్యాదు సమయంలో తనపై జరిగిన వేధింపులను వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న కొన్ని సంబంధాల కారణంగా వీసీ పట్టించుకోలేదని తెలిపారు. 

ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌ అరెస్ట్‌..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement