నో డౌట్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం | Sakshi
Sakshi News home page

నో డౌట్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం

Published Wed, Nov 22 2023 2:00 PM

PM Modis Said Ashok Gehlot Government Will Never Be Formed - Sakshi

రాజస్తాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు రసవత్తరంగా ప్రచార దూకుడిని పెంచేశాయి. ఎవరికీ వారు తమ పార్టీ గెలుస్తుందని ప్రగాల్బాలు పలుకుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దుంగార్‌పూర్‌లోని సగ్వారాలో జరుగుతున్న ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌పై తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజస్తాన్‌లో ప్రసిద్ధ "మావ్జీ మహారాజ్‌ జీ!" ఆశీస్సులతో చెబుతున్నా.. కచ్చితంగా మళ్లీ గహ్లోత్‌ ప్రభుత్వం రానే రాదని జోస్యం చెప్పారు.

ఈ పుణ్యభూమిలో ఉన్న గొప్పశక్తే తనను ఇలా అనేలా డేర్‌ చేయించిందని అన్నారు. తాను చెప్పిన జోస్యం ఫలించేలా రాజస్థాన్‌ ప్రజలే తిరగ రాయాలని అన్నారు. ఈ మేరకు మోదీ ఆ బహిరంగ ర్యాలీలో గహ్లోత్‌ ప్రభుత్వంలో జరిగిన పేపర్‌ లీక్‌లను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. విద్యా విషయంలో అనుసరిస్తున్న దారుణమైన విధానల వల్లే యువత కలలు కల్లలయ్యాయని అన్నారు. ప్రభుత్వ నియామకాలన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్కామ్‌లకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ దుష్టపాలన కారణంగానే మీ పిల్లలకు అన్యాయం జరిగిందన్నారు.

ప్రజలు కాంగ్రెస్‌ గ్యారంటీ హామీల మాయలో పడకుండా ఉన్న తరుణంలోనే మోదీ హామీలన్నీ వేగంగా చేరువవ్వడమే గాకుండా రాజస్తాన్‌ కూడా వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదన్నారు. అందుకోసం అయినా కాంగ్రెస్‌ని తరిమికొట్టలాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పాలనను మార్చే శక్తి ప్రజాస్వామ్యానికి ఉంది. ఈ టైంలో మీరు చేసే ఒక్క చిన్నపాటు ఐదేళ్ల పాటు మీకు కష్టాన్ని తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తించుకోండి.

అంతేగాదు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందేలా కాంగ్రెస్‌ని దూరం పెట్టడం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. రాజస్తాన్‌లో తమ పథకాలన్నీ అత్యంత వేగంగా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడకు వెళ్లి ఓటు వేయమని అడుగుతున్నా..ప్రజల నుంచి..ఓట్లు పడవన్నా!.. ఒకే ఒక్క సమాధానం వస్తుందని విమర్శించారు మోదీ. కాగా మూడు రోజుల్లో రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ వర్సెస్‌  బీజేపీ అన్నట్లుగా ద్విముఖ హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ వివిధ ప్రాంతీయ చిన్న చిన్న పార్టీల కూడా ఏదోరకంగా తమ ఆధిక్యతను చాటుకోవాలనే యత్నం చేస్తుండటం విశేషం .

(చదవండి: "పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!)

Advertisement
Advertisement