Tamil Nadu: రాముడి పేరుతో పూజలు వద్దు.. సీతారామన్‌ సీరియస్‌ | Tamil Nadu Govt Banned Ayodhya Ram Temple Inauguration Event Live Telecast In State, See Details Inside - Sakshi
Sakshi News home page

Tamil Nadu: రాముడి పేరుతో పూజలు వద్దు.. సీతారామన్‌ సీరియస్‌

Published Sun, Jan 21 2024 7:33 PM

Tamil Nadu Govt Banned Ram Temple Live Telecast In State - Sakshi

ఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. మరోవైపు.. రామ మందిర ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ఆల‌యాల్లో రాముడి పూజ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించ‌క‌పోవ‌డం రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యం స్టాలిన్‌ సర్కార్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సీరియస్‌ అయ్యారు. 

వివరాల ప్రకారం.. రామ మందిర ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ఆల‌యాల్లో రాముడి పూజ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించ‌క‌పోవ‌డాన్ని నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ నిర్ణ‌యం హిందూ వ్య‌తిరేక చ‌ర్య‌గా ఆమె అభివర్ణించారు. జ‌న‌వ‌రి 22న రామ మందిరంలో రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం లైవ్ టెలికాస్ట్‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిషేధించింద‌ని నిర్మల తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశారు. 

ఇదిలా ఉండగా.. నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌ట‌న‌ను దేవాదాయ శాఖ మంత్రి శేఖ‌ర్ బాబు తోసిపుచ్చారు. త‌మిళ‌నాడు ఆల‌యాల్లో రాముడి పూజ‌లు, అన్న‌దాన కార్య‌క్ర‌మాల‌పై ఎలాంటి నిషేధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాగా, ఇక‌ త‌మిళ‌నాడులో 200కుపైగా రామాల‌యాలు ఉన్నాయి. దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాల్లో శ్రీరాముడి పేరుతో ఎలాంటి పూజ‌లు, భ‌జ‌న‌, ప్ర‌సాదం, అన్న‌దానం నిర్వ‌హించ‌రాద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ప్రైవేట్ నిర్వ‌హకుల చేతిలో ఉన్న ఆల‌యాల్లోనూ ఎలాంటి ఈవెంట్స్ చేప‌ట్టరాద‌ని అధికారులు క‌ట్ట‌డి చేశారు. ప్రైవేట్ వ్య‌క్తులకు చెందిన ఆల‌యాల్లోనూ ఎలాంటి ఈవెంట్లు నిర్వ‌హించ‌రాద‌ని పోలీసులు ఆంక్ష‌లు విధించ‌డం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో, ఈ విషయం పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement