హన్మంత్‌ రెడ్డిపై వేటు | Sakshi
Sakshi News home page

హన్మంత్‌ రెడ్డిపై వేటు

Published Sun, Apr 7 2024 1:40 AM

- - Sakshi

అవినీతి ఆరోపణలు

హన్మంత్‌ రెడ్డి పనితీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. స్పెషల్‌ ఆఫీసర్‌ బాధ్యతల నుంచి తప్పించిన కలెక్టర్‌ ఆయనపై శాఖపరమైన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథచారికి ఉత్తర్వులు ఇచ్చారు. పశుసంవర్ధక శాఖలో కూడా హన్మంత్‌ రెడ్డిపై వ్యతిరేకత ఉంది. వ్యవహార తీరుతో పాటు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడిన మండల పశువైద్య అధికారి హన్మంత్‌రెడ్డిపై వేటు పడింది. డొంకేశ్వర్‌ మండలం దత్తాపూర్‌, మా రంపల్లి గ్రామ పంచాయతీలకు ఆయనను స్పెష ల్‌ ఆఫీసర్‌ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు హన్మంత్‌రెడ్డి ఎన్ని ఎ త్తుగడలు వేసినా ఫలించలేదు. రాజకీయ నాయకులు రంగంలోకి దిగినా ఆయనను కాపాడలేకపోయారు. మారంపల్లి, దత్తాపూర్‌ గ్రామ పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్‌గా నియామకమైన పశువైద్య అధికారి గత నెలలో దత్తాపూ ర్‌ జీపీ ట్రాక్టర్‌ను కార్యదర్శికి సమాచారం లేకుండా తీసుకెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్‌లో ఇసుకను నింపుకొని నిజామాబాద్‌కు తరలిస్తుండగా దొరికిపోయారు. పంచా యతీ కార్యదర్శి సుప్రియ వెంటనే ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 2న సాక్షి దినప త్రికలో ‘అధికారీ ఇదేం పని’ కథనాన్ని సాక్ష్యాలతో సహా ప్రచురించింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్మూర్‌ డీఎల్‌పీవో శివకృష్ణ జీపీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రాక్టర్‌ డ్రైవర్‌, కారోబార్‌, పంచాయతీ కార్యదర్శిని బెదిరించి తప్పు డు సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం చేసినా వారు వాస్తవాలను వెల్లడించారు. స్పెషల్‌ ఆఫీసరే బలవంతంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడని, పైగా తప్పు డు రసీదు కూడా జీపీ నుంచి తీసుకున్నట్లు విచారణ అధికారికి వివరించారు. విచారణ నివేదికను డీఎల్‌పీవో శనివారం జిల్లా పంచాయతీ అధికారికి అందజేశారు. రిపోర్టు ఆధారంగా కలెక్టర్‌కు ఫైల్‌ పెట్టారు. స్పెషల్‌ ఆఫీసర్‌ చేసిన పని నిబంధనలకు విరుద్దమని పేర్కొంటూ ఆయన్ను రెండు జీపీలకు ప్రత్యేక అధికారి హోదా నుంచి తప్పి స్తూ కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు. మారంపల్లి, దత్తా పూర్‌ పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్‌గా ఎంపీడీవో శ్రీనివాసరావును నియమించారు.

స్పెషల్‌ ఆఫీసర్‌ బాధ్యతల తొలగింపు

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

శాఖాపరమైన విచారణ చేపట్టాలని వెటర్నరీ శాఖ జేడీకి ఆదేశాలు

Advertisement
Advertisement