నాల్గోరోజు 38 నామినేషన్లు దాఖలు | Sakshi
Sakshi News home page

నాల్గోరోజు 38 నామినేషన్లు దాఖలు

Published Tue, Apr 23 2024 8:25 AM

-

నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసేందుకు నాల్గోరోజు సోమ వారం జిల్లా వ్యాప్తంగా 38మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో పార్లమెంటు నియోజకవర్గానికి ఎనిమిది మంది నామినేషన్లు వేయగా, మిగతా 30మంది వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు వేశారు. మొత్తంపై నామినేషన్లు వేసిన వారిలో 11 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు నామినేషన్లు వేయగా, నలుగురు టీడీపీ తరపున, కాంగ్రెస్‌ పార్టీ తరపున ముగ్గురు నామినేషన్లు వేశారు. పార్లమెంటు సీటుకు లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున ముప్పాళ్ల సాంబశివరావు, లావు మేఘన తరపున పూదోట అర్లయ్య(టీడీపీ), డాక్టర్‌ గోదా రమేష్‌ కుమార్‌ (జాతీయ జనసేన పార్టీ), తోకల నాగరాజు (ఆల్‌ ఇండియా పార్వార్డ్‌ బ్లాక్‌), వేంపాటి వీరాంజనేయరెడ్డి, షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ (ఇండిపెండెంట్‌), పప్పుల సాంబశివరావు (నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ), సంగం శ్రీకాంతరెడ్డి (బీఎస్‌పీ) నామినేషన్‌ వేశారు. పెదకూరపాడు అసెంబ్లీకి నంబూరు శంకరరావు, నంబూరు వి.వసంతకుమారి (వైఎస్సార్‌ సీపీ), పమిడి నాగేశ్వరరావు (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌), షేక్‌ యునాస్‌ (ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌), నంబూరు కల్యాణ చక్రవర్తి, శెట్టి సింగరయ్య(ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు. చిలకలూరిపేట అసెంబ్లీకి కావటి శివనాగ మనోహరనాయుడు (వైఎస్సార్‌ సీపీ), నల్లపు కోటేశ్వరరావు (బీఎస్‌పీ), రావు సుబ్రమణ్యం (నవతరం), ఒంటారి విజయమ్మ(తెలుగు రాజాధికార సమితి) నామినేషన్లు వేశారు. నరసరావుపేట అసెంబ్లీకి మహమద్‌ మజూర్‌షేక్‌ (ఇండిపెండెంట్‌), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి సుష్మితారెడ్డి (వైఎస్సార్‌సీపీ), తల్లపునేని హరికృష్ణ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) నామినేషన్లు వేశారు. సత్తెనపల్లి అసెంబ్లీకి సులమ్‌ రాజ్యలక్ష్మి(ఇండిపెండెంట్‌), కన్నా లక్ష్మినారాయణ (టీడీపీ), అంబటి రాంబాబు తరపున అంబటి విజయలక్ష్మి, యెండూరి ఉపేష్‌ చంద్రచౌదరి (వైఎస్సార్‌ సీపీ) నామినేషన్లు వేశారు. వినుకొండ అసెంబ్లీకి బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా గిరిబాబు (వైఎస్సార్‌ సీపీ), ఉస్తల చినకాశయ్య, షేక్‌ బాజి, దాట్ల అంజిరెడ్డి(ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు. గురజాల అసెంబ్లీకి కాసు మహేష్‌రెడ్డి(వైఎస్సార్‌ సీపీ), యరపతినేని శ్రీనివాసరావు (టీడీపీ), నీరుమళ్ల శ్రీనివాసరావు(అఖిల భారతీయ జనసంఘ), పసుపులేటి పిచ్చయ్య (ఇండిపెండెంట్‌) నామినేషన్లు వేశారు. మాచర్ల అసెంబ్లీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్‌ సీపీ), యర్రమాల రామచంద్రారెడ్డి, యర్రమాల కృష్ణవేణి(ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌) తరపున నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement
Advertisement