బూతులు మాట్లాడినట్లు నిరూపిస్తే.. బాబు, పవన్‌కు పేర్ని నాని సవాల్‌ | Sakshi
Sakshi News home page

బూతులు మాట్లాడినట్లు నిరూపిస్తే.. బాబు, పవన్‌కు పేర్ని నాని సవాల్‌

Published Thu, Apr 18 2024 5:41 PM

perni nani Serious Comments On Chandrababu pawan kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్‌ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తుచేశారు. 

చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు, పవన్‌లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్‌ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. 4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు.

బందర్‌కు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడని తెలిపారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలేనని దుయ్యట్టారు. తన కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నతాను బూతులు నానినా? అని నిలదీశారు.

పేర్ని నాని కామెంట్స్‌

  • చంద్రబాబు, పవన్ దిగజారి నా కొడుకును విమర్శిస్తున్నారు.
  • నాలుగేళ్లుగా ప్రజాసేవ చెయ్యాలని తిరుగుతున్నాడు.
  • కరోనాలో ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఐసీయూలో కూడా వెళ్లాడు.
  • కొల్లు రవీంద్ర, చంద్రబాబు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సేవ చేశాడు.
  • మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తే.. ముసలి చంద్రబాబు ఇలా మాట్లాడతాడా?
  • నేను ఏరోజైనా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశానా?
  • చంద్రబాబుకు నిరూపించమని సవాల్ చేస్తున్నా.
  • 5 ఏళ్లలో మచిలీపట్నానికి ఏం చేశానో చెప్పే దమ్ము ఉంది.
  • మచిలీపట్నం అభివృద్ధి నాడు వైఎస్సార్, నేడు వై ఎస్ జగన్ హయాంలో జరిగింది.
  • ఇద్దరిని ఒప్పించి అభివృద్ధి చేసింది నేనే.
  • యూనివర్సిటీ, పోర్టు, మెడికల్ కాలేజీ, 26 వేల ఇళ్ల స్థలాలు తెచ్చింది మేమే.
  • 2014 లో మచిలీపట్నానికి చెప్పిన ఒక్క హామీ అమలు చెయ్యలేదు చంద్రబాబు.

  • చంద్రబాబు, పవన్, బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేశారో దమ్ముంటే చెప్పండి.
  • జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తాం అని చెప్పే దమ్ముందా?.
  • సీఎం జగన్ చేసేవాన్ని మేము ఇంకా ఎక్కువ చేస్తానని చెప్తున్నారు.
  • సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు చంద్రబాబు.
  • మరి ఇప్పుడు 6 లక్షల కోట్ల పథకాలకు హామీలు ఇస్తున్నారు.

  • రామ్ నితీష్ అనే వ్యక్తిని నేను లంచం ఆడిగానని నిరూపించండి 
  • కొల్లు రవీంద్ర ఎంత అవినీతి పరుడో వాళ్ళ ఆంధ్రజ్యోతి, పేపర్‌లోనే  రాశారు
  • 2014లో చంద్రబాబు, పవన్, మోడీ ఫోటో ల తో ఇచ్చిన హామీలు అమలు చేశానని చెప్పే దమ్ముందా?
  • బందర్‌లో ఉండాల్సిన భెల్ కంపెనీ నిమ్మకూరుకు ఎందుకు తరలిపోయింది..?
  • 1937 నుంచి నడుస్తున్న కంపెనీ ని కొల్లు రవీంద్ర తరలించలేదా?
  • పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్‌లో నన్ను తిడితే నేను ఉరుకోవాలా?
  • పవన్ ఒక మాట అంటే.. నేను తిట్టకుండా ఉరుకుంటానా?
  • పవన్ చెప్పు తెగిపోద్ది అన్నాకే.. నేను చెప్పులు చూపించా.
  • కాపులని చెప్పుతో కొడతా అని పవన్ అంటే నోరు అదుపులో పెట్టుకోమని అన్నాను

  • చంద్రబాబు మేకవన్నె పులి, నమ్మితే నష్టపోతారు.
  • ఎప్పుడైనా 5 ఏళ్ల కాలంలో 2.10.లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా?
  • కేవలం వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచి వెళ్ళాడు చంద్రబాబు.
  • అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని యనమల రామకృష్ణుడు చెప్పాడు.
  • సీపీఎస్ రద్దు చెయ్యకపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే.
  • కానీ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించారు.
  • వాస్తవాలు ఉద్యోగులకు చెప్పి చేశాడు.
  • అలా నిజాయితీగా ఉండే దమ్మున్న నాయకుడు కావాలా?
  • లేక ఉద్యోగులకు చుక్కలు చూపించే చంద్రబాబు కావాలా..ఆలోచించండి

Advertisement
Advertisement