Updates: ఎమ్మెల్యే లాస్యకు నేతల నివాళులు | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య మృతి.. నేతల నివాళులు.. అప్‌డేట్స్‌

Published Fri, Feb 23 2024 8:10 AM

Political Leaders Condolence To Death Of Lasya Nanditha - Sakshi

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి Updates..

ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు

  • మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య కొనసాగిన అంతిమయాత్ర  

హైదరాబాద్‌: లాస్య నందిత అంతిమ యాత్ర ప్రారంభం

  • కాసేపట్లో మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌ నివాళులు

  •  లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

లాస్య భౌతికకాయానికి కేసీఆర్‌ నివాళులు

  • రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయానికి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులర్పించారు. సికింద్రాబాద్‌  కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
  • కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హారీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు

లాస్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత

  • ఆత్మీయ సోదరి, ఎమ్మెల్యే లాస్య మృతి ఆ కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటు. 
  • లాస్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేసినా ఆవేదనగా ఉంది.
  • ఒకే ఏడాదిలో సాయన్నను, లాస్యను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. 
  • ఈ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 
  • బీఆర్‌ఎస్‌ కూడా సాయన్న కుటుంబానికి అండగా ఉంటుంది.

►లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించిన కేసీఆర్‌
►కార్ఖానాలో లాస్య ఇంటికి చేరుకున్న కేసీఆర్‌
►లాస్య ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు.

పూర్తిస్థాయి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తాం: పోలీసులు

►సంగారెడ్డి పటాన్‌చెరు సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద లాస్య నందిత కారుకు ప్రమాదం

►ప్రమాదానికి గురైన కారును పరిశీలించిన ఏఎస్‌పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు

►ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై ASP సంజీవ రావు

►ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చింది

►కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి

►అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు

►మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు

►ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం

ఆ విషయంపై రాని స్పష్టత!

►నిన్న రాత్రి సదాశివపేట (మం) కొనపూర్ లోని మీస్కిన్ బాబా దర్గాకి వచ్చిన లాస్య నందిత కుటుంబ సభ్యులు

►కాసేపటికి దర్గాకి పీఏ ఆకాష్ తో కలిసి వచ్చిన  ఎమ్మెల్యే లాస్య నందిత

►రాత్రి 12.30 గంటలకు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెబుతున్న దర్గా నిర్వాహకులు

►అర్ధరాత్రిరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్లిన లాస్య నందిత కుటుంబం

►తిరిగి పటాన్ చెరు వైపు ఎందుకు వెళ్లారు? అన్నదానిపై నో క్లారిటీ


తండ్రీ సమాధి పక్కనే.. 

►ఇవాళే లాస్య నందిత అంత్యక్రియలు 

►మారేడ్ పల్లి లోని స్మశాన వాటిక లో లాస్య నందిత అంత్యక్రియలు

►లాస్యనందిత తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలు చేయనున్న కుటుంబ సభ్యులు

►లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

►ఈరోజు సాయంత్రం లాస్య నందిత పార్ధీవ దేహానికి నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్

►మేడారం జాతరకు వెళ్లి వచ్చిన తర్వాత లాస్య నందిత ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్‌

►కాసేపట్లో లాస్య నివాసానికి కేసీఆర్‌

►లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న కేసీఆర్

►కార్ఖానాలోని తన నివాసానికి చేరుకున్న లాస్య నందిత పార్థివ దేహం

►ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు

►అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు

►లాస్యకు పోస్టుమార్టం పూర్తి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించిన గాంధీ వైద్యులు.

►లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం 

►గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

► గాంధీ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం పూర్తయ్యాక నేరుగా కార్ఖానాలోని తన నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం

►లాస్య నందిత అంత్యక్రియలు ముగిసే వరకు ఇక్కడే ఉండనున్న ఎమ్మెల్సీ కవిత

►లాస్య నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులకు పరామర్శ.

►గాంధీలో లాస్య మృతదేహానికి పోస్టుమార్గం, భారీగా తరలివచ్చిన అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.

► లాస్య నందిత నివాసానికి వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి. 

►పటాన్‌చెరు నుంచి గాంధీ ఆసుపత్రికి లాస్య మృతదేహం తరలింపు, 

►గాంధీలో లాస్య మృతదేహానికి పోస్టుమార్టం, అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. 

►అమేధా ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహాం. ఆసుపత్రికి వెళ్తున్న కుటుంబ స‍భ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు..

►అమేధా ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు..

►లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్‌రావు. 

►పటాన్‌చెరు వద్ద ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. ఇక, ఆమె మృతిపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

►ఈ క్రమంలో లాస్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. లాస్య మరణం బాధాకరమన్నారు. లాస్య కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సీఎం రేవంత్‌ సంతాపం..

  • కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 
  • నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. 
  • వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
  • ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.


కేటీఆర్‌ సంతాపం.. 

  • ఇది దాదాపు వారం క్రితం లాస్యను పరామర్శించిన ఫోటోలు 
  • లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన, షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను 
  • చాలా మంచి నేతగా ఉన్న యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్ర నష్టం  
  • ఈ భయంకరమైన, క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు

హరీష్‌రావు సంతాపం..
►ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

గవర్నర్‌ తమిళిసై సంతాపం..

  • లాస్య దుర్మరణం చెందడం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
  • లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలిపిన గవర్నర్‌

కిషన్‌రెడ్డి సంతాపం..

  • లాస్య అకాల మరణంపై కిషన్‌ రెడ్డి సంతాపం. 
  • చిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య మరణం ఎంతో కలచివేసింది. 
  • గతంలో కార్పొరేటర్‌గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే లాస్య మంచి భవిష్యత్తున్న నాయకురాలు. 
  • ఆమె తండ్రి, నా మిత్రుడైన ఎమ్మెల్యే సాయన్న గతేడాదే అనారోగ్యంతో చనిపోయారు.
  • ఏడాది తిరిగేలోపే లాస్య రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడవటం అత్యంత దురదృష్టకరం.
  • ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఎమ్మెల్సీ కవిత సంతాపం..

  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం‌ దిగ్భ్రాంతికి గురిచేసింది. 
  • చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. 
  • లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

బీఆర్‌ఎస్‌ పార్టీ సంతాపం..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం..

  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అత్యంత బాధాకరం..
  • ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్ ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం..
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం..

గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం.. 

  • అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతి ఎంతో బాధను కలిగించింది. 
  • ఆమె తండ్రి సాయన్న ఆశయాల సాధన కోసం ప్రజా సేవలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజుల్లోనే స్వర్గస్థులవడం  చాలా బాధాకరం. 
  • ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నాను. 

బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంతాపం..

  • ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. 
  • ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను

తలసాని సంతాపం..

  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరం.
  • రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 
  • చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతుందనుకోలేదు. 
  • లాస్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం

►సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్‌, డ్రైవర్‌  తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

►ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

►దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement