శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024 | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

Published Sat, Apr 20 2024 1:25 AM

సిరిసిల్ల ఇందిరాపార్కులో ఎండిపోతున్న గడ్డి - Sakshi

పార్కుల వివరాలు ఇలా..

వెంకట్రావునగర్‌ రూ.60లక్షలు

నెహ్రూపార్కు రూ.90లక్షలు

శివనగర్‌ పార్కు రూ.40లక్షలు

అంబికానగర పార్కు రూ.50లక్షలు

ఇందిరాపార్కు రూ.80లక్షలు

గణేష్‌నగర్‌ పార్కు రూ.50లక్షలు

టీ.ఆర్‌.నగర్‌ పార్కు రూ.13లక్షలు

పద్మనగర్‌ పార్కు రూ.15లక్షలు

యాదాద్రి డెన్స్‌ పార్కు రూ.10లక్షలు

అర్బన్‌ ఫారెస్టు పార్కు రూ.1.38లక్షలు

మీరు చూస్తున్న ఈ చిత్రం సిరిసిల్ల ఇందిరాపార్కులోనివి. రూ.50లక్షలు పైబడి వెచ్చించిన ఈపార్కు అందాలు నిత్యం వందలాది మందికి కనువిందు చేసేవి. ఫొటో, వీడియో షూటింగ్స్‌కు అనుకూలంగా ఉండే ఈ పార్కు నిర్వహణ లోపంతో ఇలా డస్ట్‌బిన్స్‌ విరిగిపోయి, చెత్తకుప్పలతో, పచ్చదనం కనుమరుగైతుంది.

వర్కర్లను సర్దుబాటు చేస్తున్నాం

హరిత సిరిసిల్ల లక్ష్యాన్ని పాడుకానివ్వం. ప్రణాళికాబద్ధంగా మున్సిపల్‌ వర్కర్లతో పార్కులు, డివైడర్లు, జంక్షన్లలోని మొక్కలకు నీరు పోయిస్తున్నాం. పట్టణంలో గ్రీనరీ పనుల కోసం వర్కర్ల కొరతను సరిదిద్దుతున్నాం. ప్రత్యేక ప్రణా ళికతో పార్కుల నిర్వహణ సాగిస్తూ అవసరమై చోట్ల అభివృద్ధి పనులు చేపడతాం.

– డి.లావణ్య, మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు స్మార్ట్‌సిటీ స్ఫూర్తితో సిరిసిల్లలో నిర్మించిన పార్కులు నిర్వహణ లేక బోసిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు కార్పొరేట్‌ స్థాయిలో పార్కులు, జంక్షన్లు, డివైడర్లను సుందరీకరించారు. వాటి నిర్వహణను కొన్నేళ్లుగా మహిళా సమాఖ్యలకు కాంట్రాక్టు అప్పగించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో పార్కులు కళావిహీనంగా మారాయి. ఇప్పుడు మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిర్వహణ సాగుతుండగా.. వర్కర్ల కొరత, నిధుల లేమితో పార్కులు పనికిరాకుండా పోయాయి. ఫలితంగా పట్టణ వాసులు, చిన్నారులు, పెద్దలు వేసవిలో ఆహ్లాదం కోసం వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కళావిహీనంగా మారిన స్మార్ట్‌ అందాలపై ఫోకస్‌..

ప్రజాధనం వృథా

సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.5.46 కోట్లతో పది పార్కులు, రూ.2.15 కోట్లతో ఆరు ప్రధాన కూడళ్లు, సుమారు రూ.10 కోట్లతో పట్టణం నుంచి ఇతర నగరాలకు వెళ్లే ప్రధాన రహదారుల విస్తరణతోపాటు డివైడర్లు, వాటి మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలిచేందుకు రూ.కోట్లు వెచ్చించగా.. నిర్వహణ లోపం, పాలకులు, అధికారుల అలక్ష్యం ప్రజలకు ఆహ్లాదాన్ని దూరం చేస్తుంది. మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు పార్కులు, జంక్షన్లు, డివైడర్ల మధ్యలో గ్రీనరీ పెంచుతూ మొక్కలు, గడ్డి పాడవకుండా చూడాలి. ఏపుగా పెరిగిన చెట్లు, మొక్కలు, గడ్డిని నిత్యం కత్తిరించాలి. వాటిని నిర్ధేశిత ప్రాంతాల్లో వేయాలి. మొక్కలకు ఎరువు పెట్టడం, పాడయిన జిమ్‌ పరికరాలు, పాత్‌వేస్‌, ఫౌంటేన్స్‌ తదితరాలు రిపేరు చేయించాలి. కానీ మున్సిపల్‌ నిర్వహణ లోపంతో పార్కుల అందాలు కనుమరుగవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

కనుమరుగైన పచ్చదనం

సిరిసిల్ల వాసుల ఆగ్రహం

నిరుపయోగంగా ప్రజా ఆస్తులు

బోసిపోతున్న పార్కులు

విరిగిన ఆట వస్తువులు

పూర్తిగా పాడుబడిన తోటలాగా కనిపిస్తున్న ఈ ఫొటో శివనగర్‌ పార్కులోనివి. కార్మికవాడల్లోని ఈపార్కులో వర్కర్లు లేక, మున్సిపల్‌ పట్టింపు లేకుండా ఇలా మొక్కలు పాడై, చెట్లు విరుగుతూ.. పాత్‌ వేస్‌ పాడయి ఎండిపోయిన మొక్కలతో సందర్శకులకు దర్శనమిస్తుంది. ఇక్కడ పనిచేసే వారు లేక పార్కులో తాగుబోతులకు అడ్డాగా మారింది. స్మార్ట్‌సిటీ లుక్‌తో ఏర్పాటైన పార్కు ఇప్పుడు వట్టిపోతుంది.

జిల్లా అధికారులతో మాట్లాడుతున్న విప్‌
1/5

జిల్లా అధికారులతో మాట్లాడుతున్న విప్‌

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement